Maharashtra : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం 11 మంది సజీవదహనం

Maharashtra : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం 11 మంది సజీవదహనం

  • Written By:
  • Publish Date - October 8, 2022 / 08:53 AM IST

Maharashtra : మహారాష్ట్రలోని నాసిక్‌లో ఎదురుగా వస్తున్న కంటెయినర్‌‌ను బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి అక్కడిడక్కడే 11 మంది సజీవదహనం కాగా.. 38 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ విషాదకర ఘటన నేడు తెల్లవారుజామున మహారాష్ట్రలోని నాసిక్‌లో చోటుచేసుకుంది.వేగంగా వస్తున్న బస్సు కంటెయినర్‌ను ఢీకొట్టిన అనంతరం బస్సులో బాగా మంటలు చెలరేగడంతో దీనితో బస్సులోని ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని బాగా గాయపడ్డారు.వారిలో 11 మంది ఐతే అక్కడికక్కడేరూపు రేఖలు కూడా కాలి బూడిదయ్యారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఒక పెద్దాయన చనిపోయారు.ఇక, గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి ఐతే 24 గంటలు గడిస్తే చెప్పలేమని డాక్టర్స్ వెల్లడించారు. నాసిక్‌లోని ఔరంగాబాద్ రోడ్డులో శనివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదంతో చోటుచేసుకున్నట్టు అధికారులు గుర్తించారు . గాయపడినవారిని చికిత్స కోసం సమీపంలోని హాస్పిటల్ కు తరలించినట్టు పేర్కొన్నారు.

నాసిక్ డిసీపీ అమోల్ తాంబే మీడియాతో మాట్లాడుతూ..కంటెయినర్‌‌ను బస్సు ఢీకొట్టిన తర్వాత మంటలు చెలరేగి 10 మంది అక్కడిడక్కడే చనిపోయారని తెలిపారు.క్షతగాత్రులను చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించామని పేర్కొన్నారు.బస్సులో ఉన్న ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్నప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకోవడం వల్ల ఇంత ప్రాణనష్టం జరిగిందని, ప్రమాద సమయానికి బస్సులో 50 మందికి పైగా ఉన్నట్టు ఆయన వెల్లడించారు.మంటల్లో చిక్కుకున్న ప్రయాాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకుంది.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.