Site icon Prime9

Jaipur Crime: కాళ్లు నరికి మరీ కడియాలు దోచేశారు

jaipur crime

jaipur crime

Jaipur Crime: కాళ్ల క‌డియాల కోసం దొంగ‌లు ఓ వృద్ధురాలి కాళ్లు తెగ న‌రికేశారు. ఈ హృదయ విదారక ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది.

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని గాట్ల పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఓ కాల‌నీలో వందేండ్ల వృద్ధురాలు నివాసం ఉంటుంది. కాగా ఆమె కాళ్ల‌కు ఉన్న వెండి క‌డియాలపై దొంగ‌ల క‌న్నుప‌డింది. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యం చూసి ఆమె రెండు కాళ్ల‌ను తెగ న‌రికేసి క‌డియాల‌ను దోచుకెళ్లారు దుండగలు. బ‌య‌టికి వెళ్లిన మ‌నుమ‌రాలు ఇంటికి వ‌చ్చి చూసేసరికి వృద్ధురాలు రెండు కాళ్ల‌ను కోల్పోయి ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉంది. అది చూసి భ‌య‌ప‌డిన ఆమె వెంట‌నే త‌న త‌ల్లికి ఫోన్ చేసి జరిగిన విష‌యం చెప్పింది. ఈ దారుణ ఘటన చూసిన చుట్టుపక్కల స్థానికులు పోలీసుల‌కు సమాచారం అందించారు.

దానితో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్ర‌స్తుతం ఆమెకు చికిత్స కొన‌సాగుతున్న‌ద‌ని పోలీసులు చెప్పారు. వృద్ధురాలి మెడ‌పై కూడా క‌త్తి గాట్లు ఉన్నాయ‌ని వారు తెలిపారు. దొంగ‌ల కోసం గాలింపు చేప‌ట్టిన‌ట్లు వారు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 57 మంది విద్యార్థులపై విషప్రయోగం..!

Exit mobile version