Site icon Prime9

Bank Robbery : సినిమా స్టైల్లో బ్యాంకులో లూటీ.. 5 నిమిషాల్లోనే ఎంత దోచుకెళ్ళారంటే..?

latest crime news about Bank Robbery at gujarath

latest crime news about Bank Robbery at gujarath

Bank Robbery : అలా వచ్చారు.. ఇలా వెళ్లారు.. ఆ ఐదు నిమిషాలు అక్కడ ఏం జరుగుతుందో బ్యాంక్ లో ఉన్న కస్టమర్స్ కి, ఉద్యోగులకు కూడా అర్దం అయ్యే లోపు డబ్బు కాజేసి వెళ్లిపోయారు దుండగులు. పక్కాగా సినిమా స్టైల్లో జరిగిన ఈ దొంగతనం దేశ వ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారింది. అలానే అందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ అనూహ్య ఘ‌ట‌న గుజ‌రాత్ లో చోటు చేసుకుంది. ఓ బ్యాంకుల్లోకి ప్ర‌వేశించిన ఐదుగురు దొంగలు కేవలం ఐదు నిమిషాల్లో రూ.14 లక్షలు ఎత్తుకెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ లోని సూరత్ లో శుక్రవారం పట్టపగలు ఐదుగురు దొంగలు బ్యాంకును దోచుకుని రూ.14 లక్షల నగదుతో పరారయ్యారు. స్థానిక బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్ కి నలుగురు బైక్ లపై హెల్మెట్లు పెట్టుకొని వచ్చారు. అనంత‌రం బ్యాంకులోకి వెళ్ళి ఆయుధాల‌తో అక్క‌డున్న బ్యాంకు సిబ్బందిని బెదిరించి డ‌బ్బుతో ప‌రార‌య్యారు. ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బ్యాంకు లోపల, వెలుపల ఉన్న సీసీటీవీ ఫుటేజీ లలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.

మొద‌ట‌ బ్యాంకు ఖాతాదారులు, ఉద్యోగులందరినీ దొంగలు ఓ గదిలోకి లాక్కెళ్లారు. పింక్ షర్ట్ ధరించిన దొంగల్లో ఒకరు తన తుపాకీతో కౌంటర్లలో డబ్బు కోసం వెతకడం ప్రారంభించ‌డం వీడియోలో క‌నిపించింది.ఆ తర్వాత నల్లచొక్కా ధరించి, ముఖానికి కండువా మాత్రమే వేసుకున్న దొంగ తన బ్యాగులో డబ్బులు పెట్టడం మొదలుపెట్టాడు. బ్యాగ్ నిండగానే బ్యాంకు ఆవరణ నుంచి పారిపోయారు. చోరీ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నగర వ్యాప్తంగా చెక్‌పోస్టులు, రోడ్‌బ్లాక్‌లు ఏర్పాటు చేసి వారి కోసం గాలిస్తున్నారు.

Exit mobile version