Site icon Prime9

Karwa Chauth 2022: భార్య ఉపవాసం చేసిందని.. కత్తితో దారుణంగా పొడిచిన భర్త!

knife prime9news

knife prime9news

Uttar Pradesh: ఏ భార్య ఐనా తన భర్త సుఖంగా నిండు నూరేళ్లు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఉపవాసాలు, పూజలు చేస్తుంటారు. తన కోసం పూజలు, ఉపవాసాలు చేసే భార్యను చూసి ప్రతి భర్త మురిసిపోతుంటాడు. ఐతే తన భార్య ఉపవాసం చేసిందని ఓ కిరాతక భర్త ఆమెను కత్తిపోట్లతో దారుణంగా పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన ఆ భార్య ప్రస్తుతం హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతోంది. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని హార్దాయ్‌ జిల్లాలో జరిగింది. అసలు వివరాల్లోకి వెళితే.

నిన్న ‘కర్వాచౌత్‌’ పండుగ కావడం వల్ల హార్దాయ్‌ జిల్లాలోని కొట్‌వాలీ ఆజాద్‌ నగర్‌కు చెందిన మోనీ గుప్తా ఉదయాన్నే గుడికి వెళ్ళి పూజలు చేసి.. ఉపవాసం దీక్షను చేపట్టారు. సాయంత్రం ఇంటికి వచ్చిన మోనీ భర్త మనోజ్‌, పదునైన కత్తితో ఆమెతో గొడవ పడుతూ ఆమె మీదకు వెళ్ళాడు. కత్తి పోట్లకు తట్టుకోలేక మోనీ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు ఇంటికి వచ్చారు. దీంతో మనోజ్‌ ఇంటి నుంచి పరారయ్యాడు. అప్పటికే మోనీ శరీరం పై 12 చోట్ల కత్తి పోట్లతో తీవ్రంగా గాయాలు అయ్యాయి. అంతకు ముందు నుంచే మనోజ్ బాధ పడలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కోపంతోనే మోనీపై మనోజ్‌ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar