Site icon Prime9

Corporate Scam: భాగ్యనగరంలో భారీ కార్పొరేట్ స్కాం.. 200 కోట్ల షేర్స్ బదిలీ..!

hira multi ventures scam in hyderabad

hira multi ventures scam in hyderabad

Corporate Scam: భాగ్యనగరంలో భారీ కార్పొరేట్ స్కాం వెలుగులోకి వచ్చింది. హీరా మల్టీ వెంచర్స్ యాజమాన్యం చేసిన స్కాం బట్టబయలయ్యింది. 200కోట్ల కంపెనీ షేర్స్ ను 10మంది కుటుంబ సభ్యులకు ఆ కంపెనీ యాజమాన్యం బదలాయించుకుంది.

15శాతం ఉన్న తమ షేర్స్ ను అక్రమంగా 85శాతానికి పెంచుకుంది. సౌధీ రాజవంశీకుల వద్ద కీలక వ్యక్తులమంటూ భారీగా పెట్టుబడులు పెట్టించుకున్నారు. కాగా ఇటీవల తాము కొన్న షేర్స్ లేనట్టుగుర్తించిన మిగిలిన షేర్ హోల్డర్స్ దానితో నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ను ఆశ్రయించారు. అక్రమంగా షేర్స్ ట్రాన్ఫర్ జరిగిందని ఎన్‌సీఎల్‌టీ గుర్తించింది. దానితో బాధితులకు తిరిగి వారి షేర్స్ అప్పగించాలని హీరా మల్టీ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎన్‌సీఎల్‌టీ ఆదేశించింది. ఎన్‌సీఎల్‌టీ తీర్పుతో బాధితులకు ఊరట లభించింది.

ఇదిలా ఉంటే సౌదీకి చెందిన అబ్దుల్ రజాక్ బాగ్ధాధీ అలియాస్ అధీఅలీ పై హైదరాబాద్ లో పలు కేసులు నమోదయ్యాయి. గతంలో హీరా మల్టీ యాజమాన్యంపై హైదరాబాద్ లో సీఐడీ, ఈడీలో సైతం కేసులు నమోదయ్యాయి. సీఐడీ కేసులో గతంలో నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయ్యింది. ఇదివరకే డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ కంచర్ల కంపెనీని 500కోట్ల మేరకు హీరా మల్టీ యాజమాన్యం మోసం చేసిందని ఫిర్యాదు నమోదయ్యింది. ఈ మేరకు ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలతో హీరా కంపెనీపై క్రిమినల్ చర్యలకు సిద్దమవుతున్నారు బాధితులు.

ఇదీ చదవండి: ఒకేసారి 100 మందికిపైగా గుండెపోటు.. 149 మంది మృతి

Exit mobile version