Site icon Prime9

Heroin Seized In Kerala: రెండు బోట్ల నుంచి రూ.1700 కోట్ల హెరాయిన్ స్వాధీనం

Heroin

Heroin

Kerala: రూ.1,200 కోట్ల విలువైన హెరాయిన్ నుఇండియన్ నేవీ మరియు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అధికారులు సంయుక్తంగా దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆరుగురు ఇరాన్ పౌరులను, స్వాధీనం చేసుకున్న సరుకును కేరళలోని కొచ్చికి తీసుకువచ్చినట్లు ఎన్‌సిబి సీనియర్ ఆఫర్ సంజయ్ కుమార్ సింగ్ తెలిపారు.

ప్యాకెట్లలో ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్‌లోని కార్టెల్‌లకు ప్రత్యేకమైన మార్కింగ్ మరియు ప్యాకింగ్ ప్రత్యేకతలు ఉన్నాయని అధికారి తెలిపారు. “కొన్ని డ్రగ్ ప్యాకెట్లలో ‘స్కార్పియన్’ సీల్ గుర్తులు ఉండగా, మరికొన్ని ‘డ్రాగన్’ సీల్ గుర్తులను కలిగి ఉన్నాయన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తయారైన 200 కిలోల హెరాయిన్ మొదట పాకిస్తాన్‌లోకి వచ్చిందని, అక్కడి నుండి ఇరాన్ పడవలో ఉంచి దీనిని భారతదేశం మరియు శ్రీలంకలో విక్రయించడానికి ఉద్దేశించినట్లు ఈ రోజు భారత అధికారులు తెలిపారు.

మరో సంఘటనలో 350 కోట్ల విలువైన 50 కిలోల హెరాయిన్‌తో పాకిస్థాన్‌కు చెందిన బోటును భారత కోస్ట్‌గార్డ్‌, గుజరాత్‌ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ (ఏటీఎస్‌) జాయింట్‌ ఆపరేషన్‌లో పట్టుకున్నారు. దీంతో పాటు ఆరుగురు సిబ్బందిని కూడా ఏటీఎస్ గుజరాత్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ ఓడరేవుల ద్వారా భారత భూభాగంలోకి మాదక ద్రవ్యాలను పంపేందుకు పాకిస్థాన్ చేస్తున్న మరో ప్రయత్నంగా గుజరాత్ ఏటీఎస్ అభివర్ణించింది.

శనివారం ఉదయం ఇంటర్నేషనల్ మారిటైమ్ బౌండరీ లైన్ నుండి పాకిస్తాన్ బోట్ ‘అల్-సకార్’ స్వాధీనం చేసుకుని  విచారణ నిమిత్తం బోటును గుజరాత్‌లోని జఖౌ ఓడరేవుకు తీసుకువస్తున్నారు. అల్-సకార్ అనే పాకిస్తానీ పడవతో పాటు ఆరుగురు పాకిస్తానీ జాతీయులను అరెస్టు చేశారు.

Exit mobile version
Skip to toolbar