Site icon Prime9

Delhi Crime News: సహజీవనం చేస్తున్న మహిళను 35 ముక్కలుగా నరికి అడవిలో పడేసాడు..

murder

murder

Delhi: ఢిల్లీలో ఒక వ్యక్తి తాను సహజీవనం చేస్తున్న మహిళ శరీరాన్ని 35 ముక్కలుగా నరికి 18 రోజుల పాటు అడవిలో పడవేసినట్లు పోలీసులు తెలిపారు. అతను శరీర భాగాలను పడేయడానికి ప్రతిరోజూ తెల్లవారుజామున 2 గంటలకు బయటకు వచ్చేవాడని వారు చెప్పారు.

అఫ్తాబ్ అమీన్ పూనావాలా మే 18న తాను సహజీవనం చేస్తున్న ’శ్రద్ధా‘ ను గొంతు కోసి చంపాడు. తరువాత ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేసి, వాటిని ఉంచడానికి ఒక ఫ్రిజ్‌ను కొన్నాడు. ఆ శరీర భాగాలను 18 రోజులపాటు అతను మెహ్రౌలీ అడవిలోని వివిధ ప్రాంతాలలోపారవేసాడు. 26 ఏళ్ల శ్రద్ధా ముంబైలోని ఒక బహుళజాతి కంపెనీకి కాల్ సెంటర్‌లో పని చేసేది. అక్కడ ఆమెకు పూనావాలా పరిచయమయ్యాడు. దీనితో ఇద్దరూ డేటింగ్ మొదలుపెట్టారు. వారి సంబంధానికి ఆమె కుటుంబం అంగీకరించకపోవడంతో పారిపోయి ఢిల్లీకి వచ్చారు. వారు మెహ్రౌలీలోని ఒక ఫ్లాట్‌లో నివసించడం ప్రారంభించారు. శ్రద్ధా తన కుటుంబ సభ్యుల ఫోన్ కాల్‌లకు స్పందించడం మానేసింది. నవంబర్ 8న ఆమె తండ్రి వికాస్ మదన్ తన కుమార్తెను చూసేందుకు ఢిల్లీకి వచ్చారు. ఫ్లాట్‌కి రాగానే తాళం వేసి ఉంది. దీనితో అతను మెహ్రౌలీ పోలీసులను ఆశ్రయించాడు.

అతని ఫిర్యాదు మేరకు పోలీసులు పూనావాలాను శనివారం అరెస్టు చేశారు. విచారణలో శ్రద్ధా తనను వివాహం చేసుకోవాలని కోరుకోవడంతో ఇద్దరూ తరచూ గొడవ పడేవారమని పూనావాలా చెప్పినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

Exit mobile version