Home » crime news » Guntur Crime News Husband Injected Hiv Virus Into His Wife
గుంటూరు క్రైం: తాడేపల్లిలో దారుణం.. కట్టుకున్న భర్తే కాలయముడై హెచ్ఐవీ ఇంజెక్షన్లు ఇచ్చి మరీ..!
వారిద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. కొద్ది కాలం అంతా సంతోషంగా జీవితం కొనసాగింది. అంతలోనే ఆ భర్తకు భార్య బోర్ కొట్టిందో ఏమో లేదా చెడు వ్యసనాలకు బానిసయ్యాడో తెలియదు కానీ మరో యువతితో అక్రమ సంబంధం కొనసాగించాడు. అంతటితో ఆగక ప్రేమ పెళ్లి అయితే కట్నం తీసుకోకూడదా అంటూ భార్యను అదనపు కట్నం కోసం వేధించసాగాడు.
Guntur Crime: వారిద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. కొద్ది కాలం అంతా సంతోషంగా జీవితం కొనసాగింది. అంతలోనే ఆ భర్తకు భార్య బోర్ కొట్టిందో ఏమో లేదా చెడు వ్యసనాలకు బానిసయ్యాడో తెలియదు కానీ మరో యువతితో అక్రమ సంబంధం కొనసాగించాడు. అంతటితో ఆగక ప్రేమ పెళ్లి అయితే కట్నం తీసుకోకూడదా అంటూ భార్యను అదనపు కట్నం కోసం వేధించసాగాడు. తనను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించి దానికి అనుగుణంగా వ్యూహాలు రచించాడు. ఇంకేముంది బలం ఇంజెక్షన్లు అంటూ హెచ్ఐవీ ఇంజెక్షన్లు ఇవ్వడం ప్రారంభించారు. ఈ విషయాన్ని కొద్ది రోజుల తర్వాత గుర్తించిన భార్య ఏం చేసిందో ఈ కథనం ద్వారా చూడండి.
వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలానికి చెందిన మమత చరణ్ ఇద్దరూ 2015లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొద్ది కాలం వీరి సంసారం మూడు పువ్వులు ఆరుకాయలు అన్నట్టుగా సుఖసంతోషాలతో వెల్లివిరిసింది. అయితే అంతలోనే ఆ పండిటి కాపురంలో కలహాలు స్టార్ట్ అయ్యాయి. వేరే మహిళకు అలవాటు పడిన చరణ్ తన భార్య మమతను అదనపు కట్నం తెమ్మంటూ రోజూ వేధించేవాడు. ఎలాగైనా తన భార్య అడ్డుతొలగించుకోవాలని భావించిన చరణ్ తాను అనుకున్నదే తడవుగా దానికి అనుగుణంగా పక్కా ప్లాన్ అమలు చేశాడు. తనకు తెలిసి ఓ ఆర్ ఎంపీ డాక్టర్ సాయంతో తన భార్యకు హెచ్ఐవి ఇంజెక్షన్లు ఇవ్వడం ప్రారంభించాడు. ఇవేంటి అని అడిగిన మమతకు బలానికి ఇంజెక్షన్లు అంటూ మాయమాటలు చెప్పి ఆ ఇంజెక్షన్లను ఇచ్చారు.
ఇక ఇదిలా ఉంటే కొద్దికాలాని భర్త నిజ స్వరూపం తెలుసుకున్న మమత తన భర్తను నిలదీయడం మొదలుపెట్టింది. ఇక దానితో తనను రోజూ తన భర్త చిత్రవధ చేస్తున్నాడంటూ మమత తాడేపల్లి పోలీసులును ఆశ్రయించింది. కొద్ది రోజులుగా తనకు ఆరోగ్యం బాగోవడం లేదని వైద్య పరీక్షలు చేయించుకున్న మమత హెచ్ఐవీ పాజిటివ్ అని తేలడంతో ఒక్కసారిగా ఖంగుతినింది. ఇపుడు నాకు ఎయిడ్స్ పాజిటివ్ నేను బ్రతకటం ఎలా అని నాకు న్యాయం చెయ్యండి అంటూ మమత పోలీసుల వద్ద తన ఆవేదనను వ్యక్తం చేసింది. దానితో మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త చరణ్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇలా ఆమె పాలిట కట్టుకున్న భర్తే కాలయముడై ఆ భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. తన నిండు నూరేళ్ల జీవితాన్ని హెచ్ఐవీ మహమ్మారి బారిన పడేలా చేశాడు.