Site icon Prime9

Hyderabad Crime News: శ్మశానంలో యువతి పై గ్యాంగ్ రేప్

Crime News about gang rape on btech student in ap

Crime News about gang rape on btech student in ap

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. శ్మశానవాటికలో యువతి పై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఛత్రినాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జీఎం చావునీకి చెందిన ఇబ్రహీంబేగ్‌ (24), ఉమర్‌ బేగ్‌(20) అన్నదమ్ముల పిల్లలు. స్థానికంగానే ఉండే మతిస్థిమితం లేని ఓ మహిళ (30)తో ఇబ్రహీంకు ఉన్న సాన్నిహిత్యంతో లైంగిక దాడి చేద్దామని అన్నదమ్ములు పథకం రచించారు.

ఈ క్రమంలోనే ఇబ్రహీం శనివారం యువతిని పిలిపించుకొని పధకం ప్రకారం బైక్‌ పై తిప్పుతూ జీఎం చావునీలో ఓ శ్మశాన వాటికలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. అనంతరం ఉమర్‌ కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పై యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

 

Exit mobile version