Site icon Prime9

Hyderabad: మీర్ పేట్ లో బాలిక పై గ్యాంగ్ రేప్.. పరారీలో నిందితులు

19-year-old-model-gang-raped-in-moving-car-in-kochi

19-year-old-model-gang-raped-in-moving-car-in-kochi

Meerpet: భాగ్యనగరంలో బాలికలు, అబలలపై అత్యాచారాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కార్కానాతో పాటు పలు ఘటనలను మరిచిపోకముందే నగరంలోని మీర్ పేట్ లో మరో దారుణం చోటుచేసుకొనింది. 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక పై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు.

ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ మరీ బెదిరించారు. నిందితుల పై కిడ్నాప్, పోక్సో చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనలో, సదరు బాధితురాలు తన స్నేహితురాలు నివాసానికి వెళుతున్న సమయంలో కొంతమంది యువకులు కిడ్నాప్ చేసారు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను దాదాపు మూడు గంటలపాటు బైక్‌ పై పలు ప్రాంతాలకు నిందితులు తిప్పినట్లు బాధితురాలు స్టేట్‌మెంట్ ఇచ్చింది. నిందితులు పరారీలో ఉన్నారు. మొత్తం ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. అయితే అత్యాచారంలో ఇద్దరు వ్యక్తుల ప్రమేయం మాత్రమే ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

వందల కోట్ల రూపాయల వ్యయంతో నగరంలో సిసి కెమరాల నిఘా ఏర్పాటు చేసిన్నప్పటికీ దోపిడీలు, అత్యాచారలు మాత్రం ఏమాత్రం ఆగడం లేదు. శివారు ప్రాంతాల్లో మరింత భద్రతను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్మాణ ప్రాంతాలు, అపార్టుమెంట్ల వద్ద నిఘాను పెంచకపోతే ట్విన్ సిటీస్ లో ఆడపిల్ల రోడ్డుపై తిరిగే స్వేచ్ఛను కోల్పోవచ్చు.

ఇది కూడా చదవండి: Gun Misfire: గన్ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ మృతి

Exit mobile version