Site icon Prime9

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. 40 మందికి గాయాలు

Road accidents 4 people killed

Road accidents 4 people killed

Road accident: ఆర్టీసీ బస్సు – కారు ఢీ కొట్టుడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. ఆందోల్‌ మండలం కన్సాన్‌పల్లి వద్ద నాందేడ్‌ – అకొలా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొని నలుగురు వ్యక్తులు మరణించారు. కాగా పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారిని హైదరాబాద్‌లోని జీడిమెట్ల వాసులైన వినోద, సుప్రసిత, చిన్నారి కాంక్షితో పాటు డ్రైవర్‌ దిలిప్‌లుగా పోలీసులు గుర్తించారు.

ఇదిలా ఉండగా మహబూబ్ నగర్ రూరల్‌ మండలం దివిటిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై మరో ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేటు ట్రావెల్‌ బస్సు ప్రమాదవశాత్తు బోల్తాడింది. ఈ ఘటనలో 40 మంది ప్రయాణికులకు గాయాలు కాగా 14 మందిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్‌లో 54 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీలోని పులివెందుల నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. బస్సు బోల్తాపడడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: సుపారీ ఇచ్చి మరీ.. కొడుకుని హత్య చేయించిన తల్లిదండ్రులు

Exit mobile version