Fire Accident: హైదరాబాద్ లో వరుస అగ్నిప్రమాదాలు కలవరపెడుతున్నాయి. తాజాగా బాగ్ లింగంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శుభకార్యాలకు ఉపయోగించే.. డెకరేషన్ సామాగ్రి దుకాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో.. డెకరేషన్ సామాగ్రి పూర్తిగా కాలి బూడిదైంది.
నగరంలోని ప్రధాన ప్రాంతమైన బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వీఎస్టీ సమీపంలో గల ఓ గోదాములో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఫంక్షన్లకు ఉపయోగించే.. డెకరేషన్ సామగ్రి ఈ మంటల్లో పూర్తిగా కాలి బూడిదయ్యాయి. స్థానికుల సమాచారంతో.. ఘటన స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశాయి. సమీప ప్రాంతంలో బస్తీవాసులు ఉండటంతో.. వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానిక పోలీసులు తెలిపారు.
అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగిన ప్రాంతాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు.
ఈ ఘటనపై మాట్లాడిన ఆయన.. వ్యాపారస్థులకు వార్నింగ్ ఇచ్చారు.
కమర్షియల్ వ్యాపారం నిర్వహించే వారు.. ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
ఎండాకాలం సమీపిస్తున్నందువల్ల మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
నిర్లక్ష్యంగా ప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అగ్ని ప్రమాదాల నివారణకు.. ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
హైదరాబాద్ లో వరుస అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
కొద్ది రోజుల క్రితం.. రాంగోపాల్ పేటలో ఇలాంటి ప్రమాదం సంభవించింది.
డెక్కన్ నైట్ వేర్ కార్ల విడి భాగాల షాప్ లో మంటలు చెలరేగి భారీగా ఆస్థి నష్టం జరిగింది.
తాజాగా మరో ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
వ్యాపారస్థులు నిర్లక్ష్యంగా ఉండటంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.
అగ్ని ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/