Site icon Prime9

Vuyyuru: పెళ్లి కాకుండానే గర్బం దాల్చిన కుమార్తెలు.. తండ్రి ఆత్మహత్య

mass suicide by 4 members in family at gujarath and news got viral

mass suicide by 4 members in family at gujarath and news got viral

Vuyyuru: తన ఇద్దరు కూతుళ్లు పెళ్లి కాకుండానే గర్భవతులయ్యారని తెలిసి ఒక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా ఉయ్యూరు కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు వేర్వేరు కాలేజీల్లో ఒకరు డిగ్రీ, మరొకరు ఇంటర్ చదువుకుంటున్నారు. వీరి తండ్రి లారీడ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే సడన్ గా కుమార్తెలిద్దరికీ ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు.

వారికి పరీక్షలు చేసిన వైద్యులు .. ఇద్దరూ గర్భం దాల్చినట్లు కనుగొన్నారు. చిన్న కుమార్తెకు తొమ్మిదో నెల.. పెద్ద కుమార్తెకు ఆరో నెల అని వారు తెలిపారు. ఈ విషయం పోలీసులకు కూడ తెలియజేసారు.

అనంతరం వీరిద్దరిని చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసి అమ్మాయిల తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటనతో ఉయ్యూరులో విషాదం చోటు చేసుకుంది.

Exit mobile version