Site icon Prime9

Crime News: ఒకే ఇంట్లో 8 మృతదేహాలు.. హత్య లేక ఆత్మహత్యా..?

eight-people-died-in-a-house-in-america

eight-people-died-in-a-house-in-america

Crime News: ప్రపంచంలో ఏదో మూలన ఏదో ఒక నేరవార్తలను రోజు వింటూనే ఉంటుంటాం. ఈ క్రమంలోనే అమెరికాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే ఇంట్లో ఎనిమిది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. కాగా వారిలో ఆరుగురు చిన్నారులు ఉండటం తీవ్ర విషాదం.

అమెరికా దేశంలోని ఒక్లహామా రాష్ట్రంలోని బ్రోకెన్‌ యారో పట్టణంలోని ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో ఆ ఇంట్లో ఇద్దరు పెద్దలు ఆరుగురు చిన్నారులతో కలిసి ఉన్నారు. కాగా ఆ సమయంలో ఓ వ్యక్తి కారులో వెళ్తుండగా ఆ ఇంటి నుంచి దట్టమైన పొగలు వస్తున్న విషయాన్ని గుర్తించారు. అదే సమయంలో ఆ ఇంటి ముందున్న ఓ వ్యక్తి స్పృహలో లేని ఒక మహిళను ఈడ్చుకెళ్తూ కనిపించాడని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందిచారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మంటలను అదులోకి తీసుకువచ్చారు. మంటల్లో తగలబడిపోతున్న ఇంట్లో ఉన్న ఎనిమిది మంది మృతదేహాలను పోలీసులు బయటకు తీసుకువచ్చారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇంట్లో ఉన్న ఇద్దరు పెద్దలు మొదట పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నారా? లేదా వీరందరినీ ఇంకెవరైనా హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరిస్తున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనలో మరింత విషాదం ఏంటంటే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులందరూ 1 నుంచి 13 ఏళ్ల లోపు వారే కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మృతుల వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు. కాగా ప్రమాదం జరిగిన ఇంట్లో నుంచి పోలీసులు తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన అగ్ని ప్రమాదం కారణంగా జరిగినట్టు కనిపించడం లేదని అగ్నిమాపక శాఖ అధికారులు అంటున్నారు. మరి ఈ కేసులోని తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: ఎంత ఘోరం.. ఛాయ్ తాగి ఐదుగురు మృతి

Exit mobile version