Hero Navdeep : నటుడు నవదీప్ కు ఈడీ నోటీసులు.. ఈనెల 10న విచారణకు

ప్రముఖ నటుడు నవదీప్ కు తాజాగా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల మాదాపూర్ డ్రగ్స్‌ కేసు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆ కేసులో కూడా ఆయన పేరు ప్రస్తావనకి రావడం.. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని, పలు వార్తలు తెర పైకి వచ్చాయి. కాగా ఈ నెల 19వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని

  • Written By:
  • Publish Date - October 7, 2023 / 04:02 PM IST

Hero Navdeep : ప్రముఖ నటుడు నవదీప్ కు తాజాగా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల మాదాపూర్ డ్రగ్స్‌ కేసు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆ కేసులో కూడా ఆయన పేరు ప్రస్తావనకి రావడం.. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని, పలు వార్తలు తెర పైకి వచ్చాయి. కాగా ఈ నెల 19వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ గడువు తీరడంతో నవదీప్ నివాసంలో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత విచారణకు కూడా హాజరయ్యారు.

కాగా ఇప్పుడు తాజాగా నవదీప్ కి ఈడీ నోటీసులు జారీ చేసింది. 10 తేదీన విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. నవదీప్ కు నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ తో సంబంధాలున్నట్లుగా నార్కోటిక్ బ్యూరో విచారణలో గుర్తించింది. కాగా గత నెలలో నగరంలో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు మాదాపూర్ పోలీసులతో కలిసి డ్రగ్స్ సరఫరా విషయాలో ఆపరేషన్ నిర్వహించారు. దీంట్లో భాగంగా పలువురుని అదుపులోకి తీసుకన్నారు. వీరిలో నైజీరియాకు చెందిన వ్యక్తులతో పాటు ఓ దర్శకుడు, మరో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

వీరి నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసినవారిని విచారించగా నటుడు నవదీప్ కు వారితో సంప్రదిపులు జరిపినట్లుగా తెలుసుకున్నారు. దీంతో నవదీప్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవలే హీరో నవదీప్ ను పోలీసులు విచారించారు. ఈక్రమంలో మరోసారి నోటీసులు జారీ చేయటంతో పాటు అక్టోబర్ 10న విచారణకు రావాలని ఆదేశించారు.