Hyderabad Murder: సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకూ కనుమరుగవుతున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో పడి నమ్ముకున్న వారిని నట్టేటా ముంచుతున్నారు. ఈ ఘటనల్లో ఏ సంబంధం లేని పలువురు తనువు చాలిస్తున్నారు. తాజాగా భర్త చనిపోతుంటే ఓ భార్య చూసి ఆనందించిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. ప్రియుడు సజీవ దహనం చేస్తుంటే.. లైవ్ లో చూసి మరి ఆనందించింది.
లైవ్ లో సజీవ దహనం.. (Hyderabad Murder)
సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకూ కనుమరుగవుతున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో పడి నమ్ముకున్న వారిని నట్టేటా ముంచుతున్నారు. ఈ ఘటనల్లో ఏ సంబంధం లేని పలువురు తనువు చాలిస్తున్నారు. తాజాగా భర్త చనిపోతుంటే భార్య చూసి ఆనందించిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. ప్రియుడు సజీవ దహనం చేస్తుంటే.. లైవ్ లో చూసి మరి ఆనందించింది. ఈ ఘటన హైదరాబాద్ లో కూకట్ పల్లిలో జరిగింది.
జగద్గిరిగుట్టలో ఈ నెల 10న జయకృష్ణ అనే వ్యక్తి మృతి చెందాడు. మెుదట అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత విచారణలో భాగంగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. పోలీసులు వెల్లడించిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చంపమని సలహాలు..
కృష్ణా జిల్లా మట్లం గ్రామానికి చెందిన జయకృష్ణ, దుర్గభవాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జయకృష్ణ హైదరాబాద్ వచ్చి.. జగద్గిరిగుట్టలో జిమ్ రన్ చేస్తున్నాడు.
అక్కడే అడ్డాల చిన్నతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో జయకృష్ణ తరచూ ఇంటికెళ్లేవాడు. ఈ క్రమంలో 2018 నుండి దుర్గాభవానితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు.
ఈ విషయం జయకృష్ణకు తెలియడంతో.. భార్యను పుట్టింటికి పంపే ప్రయత్నం చేశాడు. జయకృష్ణ ఉంటే తాము ఇక కలుసుకోలేమని, అతడి అడ్డు తొలగించేందుకు ప్లాన్ వేశారు.
ఈ నెల 10వ తేదీన జయకృష్ణకు చిన్నా ఫుల్లుగా మద్యం తాపించి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత అగ్నిప్రమాదంలో మృతి చెందినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు.
మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి తమదైన శైలిలో విచారించారు. హత్యకు పాల్పడిన దుర్గాభవాని, చిన్నలను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
అయితే నిందితుల విచారణలో దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
భర్త సజీవ దహనం అవ్వడాన్ని వీడియో కాల్ లైవ్‌లో చూసి ఆనందించింది భార్య దుర్గాభవాని.
పోలీసులకు దొర్కకుండా హత్య చేయాలని ప్రియుడికి పలు సలహాలు కూడా ఇచ్చినట్లు తెలిసింది.