Site icon Prime9

Crime News : భువనగిరి కలెక్టరేట్ లో కత్తి పోట్ల కలకలం.. యువకుడిపై దాడి చేసిన మహిళ

Crime News about women attack on man at bhuvagiri collectorate

Crime News about women attack on man at bhuvagiri collectorate

Crime News : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపధ్యంలో మహిళ ఉద్యోగి మరో ఉద్యోగిపై కత్తితో దాడి చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నర్రా శిల్ప 2018 నుంచి ఆత్మకూరు (ఎం) మండల వ్యవసాయాధికారి (ఏవో) గా పనిచేస్తున్నారు. అదే మండలంలోని పల్లపహాడ్ వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) గా మనోజ్ పనిచేస్తున్నారు. శిల్పకు 2012లో వివాహం జరగ్గా రెండున్నరేళ్ల బాబు కూడా ఉన్నాడు. అయితే కోవిడ్ కాలం నుండి, శిల్పా తన సహోద్యోగి మనోజ్‌కి దగ్గరయ్యారు. అప్పటి నుంచి వారి మధ్య సంబంధం కొనసాగుతూ వచ్చింది. కాగా ఆ సమయంలో… శిల్ప పలుమార్లు గర్భవతి కాగా గర్భనిరోధక మాత్రలు వేసుకుని కడుపుతీయించుకుందని కూడా తెలుస్తుంది.

అయితే వారి విషయం ఆమె భర్తకు తెలిసి చాలాసార్లు మందలించాడు. ఇది జరిగిన తర్వాత కూడా శిల్పా, మనోజ్ మధ్య ఉన్న సంబంధం కార్యాలయంలో వెలుగులోకి రావడంతో వారిపై చర్యలు తీసుకున్నారు. కొన్ని రోజుల పాటు సస్పెండ్ కూడా అయ్యారు. ఇక వీరి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆమె భర్త విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో.. అప్పటి నుంచి విడివిడిగా ఉంటున్న శిల్ప.. మనోజ్ కు ఈ విషయాన్ని చెప్పింది. సరే విడాకులు తీసుకోమంటూ మనోజ్ కూడా శిల్పకు చెప్పాడు.

ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నా.. మూడు నెలల క్రితం యాదగిరిగుట్ట మండలంలోని మాసాయిపేటకు డిప్యుటేషన్‌పై వెళ్లిన మనోజ్ తర్వాత రెండు నెలలు సెలవు పెట్టారు. నిన్న మధ్యాహ్నం తిరిగి విధులకు హాజరయ్యేందుకు కలెక్టరేట్‌లోని జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయానికి వచ్చారు. అతడితో మాట్లాడేందుకు శిల్ప ప్రయత్నించగా అది వాగ్వివాదానికి దారితీసింది. ఘర్షణ జరుగుతుండగానే శిల్ప అకస్మాత్తుగా కత్తితీసి అతడిపై దాడిచేసింది. మెడ, వీపు భాగాలపై గాయాలు కావడంతో మనోజ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మనోజ్ కత్తితో (Crime News) వచ్చి తనపై దాడికి ప్రయత్నించాడని శిల్ప వాపోతున్నారు.

Exit mobile version