Site icon Prime9

Crime News : కన్నతల్లిని కడతేర్చిన కొడుకు.. నిద్రపోతుండగా గొంతు నులిమి

Crime News : మాత, పిత, గురు, దైవం.. అని అంటూ ఉంటాం.. దైవం కన్నా గొప్పగా భావించే వాళ్ళు ఎవరయినా ఉన్నారు అంటే అది తల్లిదండ్రులే. కానీ రాను రాను జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తుంటే సభ సమాజం కూడా తలదించుకునేలా ఉన్నాయి. రోజురోజుకీ మానవ సంబంధాలు మంట గలిసి పోతున్నాయి అనేలా.. కన్నవారీ కడతేరుస్తున్న ఘటనలు మనం గమనించవచ్చు. తాజాగా అలాంటి ఘటనే వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

ఈ ఘటనలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా లోని బషీరాబాద్ మండలం ఖాసీంపూర్ లో వెంకటేష్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణానికి గ్రామంలో పలువురి దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో అప్పు ఇచ్చిన వాళ్ళు డబ్బులు కోసం వెంకటేష్ తల్లిని నిలదీశారు. దీంతో ఆమె తన కొడుకు వచ్చి డబ్బులు ఇస్తాడని వారితో చెప్పింది. కాగా ఇటీవల దసరా పండుగకు  వెంకటేష్ ఇంటికి వచ్చాడు.

ఈ క్రమంలో అప్పు ఇచ్చిన సదరు వ్యక్తులు వెంకటేష్ ని డబ్బులు ఇవ్వాలని అతడిని అడగడంతో.. తన మనస్తాపానికి గురైన అతను తల్లి పైన కక్ష పెంచుకున్నాడు. ఇక అంజమ్మ నిద్రపోతుండగా ఆమె గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి చెరువులో పడేసాడు. కాగా తల్లి కనిపించకపోవడంతో అంజమ్మ మరో కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా విషయం వెలుగులోకి వచ్చింది.

Exit mobile version
Skip to toolbar