Site icon Prime9

Crime News : బాలికపై పోలీస్ కానిస్టేబుల్ అఘాయిత్యం.. లాఠీలతో కొడుతూ, గొంతుకు వైరు బిగించి అమానుషంగా !

crime news about police constable molesting minor girl in ananthapuram

crime news about police constable molesting minor girl in ananthapuram

Crime News : చేతిలో అధికారం ఉంది.. ఏం చేసిన చెల్లుతుంది అని అనుకున్న వారికి.. ఎవరికి అయిన సరే.. తప్పు చేస్తే శిక్ష పడకుండా మానదు.  మరి ముఖ్యంగా చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే బరితెగిస్తే.. అధికారం ఉంది అనే అహంకారంతో ఏం చేసిన అడిగేవాడు లేడు అనుకుంటే..  చివరికి కటకటాల్లో ఊచలు లెక్కబెట్టక తప్పదు. అనంతపురం జిల్లాలో ఆలస్యంగా వెలుగు లోకి వచ్చిన ఒక ఘటన చూస్తే ఛీ అనిపించక మానదు. మనం కన్న వారే మన పిల్లలు.. మిగతా వారిని ఏమైనా చేయవచ్చు అనుకునే కామంతో కళ్ళు మూసుకుపోయిన కొంత మందికి ఈ ఘటన ఒక చెప్పుతో కొట్టినట్లు సమాధానంగా నిలిచింది.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా గుత్తి ప్రాంతానికి చెందిన రమేష్ కానిస్టేబుల్ కాగా అతడి భార్య ఎక్సైజ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. వీరికి ఓ ఆడపిల్ల సంతానం.. అయితే భార్యాభర్తలు  ఇద్దరూ ఉద్యోగులే కావడంతో.. పాపను చూసుకోడానికి తెలిసిన వారి ద్వారా ఓ బాలికను నియమించుకున్నారు. తమ ఇంట్లోనే వుంటూ కూతురి అలనాపాలన చూసుకుంటున్న బాలికపై రమేష్ కన్నుపడింది. భార్య విధులకు వెళ్లినపుడు ఇంట్లోనే వుండి బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు.

ఇలా గత ఆరునెలలుగా బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దీంతో బాలిక గర్భం దాల్చగా అబార్షన్ కూడా చేయించాడు. అత్యాచారం, అబార్షన్ విషయాలు ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయంతో బాలిక ఎవరికీ చెప్పలేకపోయింది. బాలిక నిస్సహాయ స్థితిని అలుసుగా తీసుకుని రమేష్ చిత్రహింసలకు గురిచేసేవాడు. లాఠీలతో కొడుతూ, గొంతుకు వైరు బిగించి నరకం చూపించేవాడు. రోజురోజుకు అతడి వికృత చేష్టలు ఎక్కువ కావడంతో భరించలేకపోయిన బాలిక ధైర్యం చేసి తనపై గత కొంతకాలంగా జరుగుతున్న అఘాయిత్యాల గురించి తల్లిదండ్రుల ముందు వాపోయింది. దీంతో వారు ఉన్నతాధికారులను కలిసి కానిస్టేబుల్ రమేష్ పై ఫిర్యాదు చేసారు. దీంతో అతడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version