Site icon Prime9

Crime News : కన్నతల్లిని కిరాతకంగా చంపిన కొడుకు.. నాలుక కోసి మరీ.. ఎక్కడంటే ??

crime news about mother killed by own son at vijayanagaram district

crime news about mother killed by own son at vijayanagaram district

Crime News : కని పెంచిన తల్లినే కాటికి పంపించాడు ఓ కిరాతకపు కొడుకు.. తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటూ దైవం కన్నా తల్లికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాం. అలాంటిది అలాంటిది ఓ క్రూరుడైన కొడుకు తల్లిని అతి దారుణంగా నాలుక కోసి చంపడం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా రామభద్రపురంలో చోటుచేసుకుంది.

ఈ ఘటనలో వివరాల్లోకి వెళ్తే.. రామభద్రాపురం లోని వసంతల వీధిలో నివసించే రవణమ్మకు శ్రీనివాసరావు అనే కుమారుడు ఉన్నాడు. మద్యానికి బానిసైన అతను నిత్యం తాగుతూ జులాయిగా తిరుగుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఫుల్ గా తాగొచ్చిన కొడుకును రవణమ్మ తీవ్రంగా మందలించింది. కొద్దిసేపు తల్లీకొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహంతో శ్రీనివాస తన తల్లిపై దారుణంగా దాడి చేసి హతమార్చాడు. చంపిన అనంతరం ఆ తల్లి నాలుక కోసి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లాడు ఆ దుర్మార్గుడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version