Site icon Prime9

Crime News : నెల్లూరు జిల్లాలో ఆరేళ్ల చెవిటి, మూగ బాలికపై అత్యాచారం.. సొంత మేనమామే

Crime News about deaf and mute 6 years girl rape at nellore district

Crime News about deaf and mute 6 years girl rape at nellore district

Crime News : ఏపీలోని నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల పరిధిలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చెవిటి, మూగ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో సొంత మేనమామే కీచకుడిగా మారి ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగినప్పటికీ గురువారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. నిందితుడిని ఎస్ మాల్యాద్రిగా గుర్తించారు. గ్రామంలో జరుగుతున్న ఉత్సవాలకు బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

బాధితురాలు, ఆమె తల్లి.. నిందితుడితో కలిసి కిరాణా సామాను కొనుగోలు చేసేందుకు సమీపంలోని గ్రామానికి వెళ్లారు. అయితే అదే అదునుగా భావించిన ఆ కిరాతకుడు.. బాలికకు చాక్లెట్‌ కొనిపిస్తానని ఆశ జూపి.. తన బైక్‌పై నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకుతుండగా.. బాలికతో పాటు నిందితుడు గ్రామానికి వచ్చాడు. అత్యాచార ఘటనతో దిగ్భ్రాంతికి గురైన ఆ చిన్నారి సంకేత భాషతో తనపై జరిగిన దారుణాన్ని వివరించింది. దీంతో పాటు బాలిక ప్రైవేట్ పార్ట్ నుంచి రక్తం కారడాన్ని గమనించిన బాధితురాలి తల్లి..  వెంటనే పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిపై ఐపీసీ, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసాం. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చాం అని పోలీసులు తెలిపారు.

ఇలాంటి మరో ఘటనే హైదరాబాదులో ఆగస్ట్ 19 న చోటుచేసుకుంది. చెవిటి, మూగ మహిళపై ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. అదను చూసి ఇంట్లోకి వచ్చిన ఎదురింటి యువకుడు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను బాత్రూంలో బంధించి మరీ దారుణంగా అత్యాచారం చేశాడు. ఈ ఘటన హుమాయున్ నగర్ పిఎస్ పరిధిలో జరిగింది. ఈ ఘటనపై హుమాయూన్ నగర్ పోలీసులకు బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాయిని అరెస్టు చేశారు.

Exit mobile version