Site icon Prime9

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఎంపీ మాగుంట కుమారుడిని ప్రశ్నిస్తున్న సీబీఐ

CBI questioning MP Magunta's son

CBI questioning MP Magunta's son

Delhi: ఢిల్లీ లిక్కర్ స్కాం ఒక్కో రోజు ఒక్కో విధంగా ప్రకంపనలు గుప్పిస్తుంది. తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నేడు సీబీఐ ఎదుట హాజరుకావాలని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని కూడా సీబీఐ ప్రశ్నిస్తోంది. ఒక విధంగా సీబీఐ లిక్కర్ స్కాంలో తన దూకుడును పెంచిందనే చెప్పాలి.

ఎందుకంటే మాగుంట పేర్కొనే విధంగానే మనీశ్ సిసోడియా కూడా తనవద్ద ఏమీ ఆధారాలు సీబీఐకి లభించలేదని పేర్కొనివున్నారు. కాని తాజాగా ఈ ఇరువురికి సీబీఐ కార్యాలయానికి రావాలంటూ తాఖీదులు అందాయి. ఒక్క ఏపీలోనే మద్యం కుంభకోణంలో సీబీఐ అధికారులు 25 చోట్ల సోదాలు చేసి వున్నారు.

ఎంపీ మాగుంట కుటుంబానికి ఢిల్లీలోని నాలుగు జోన్లలో 108 మద్యం షాపులు ఉన్నాయి. మాగుంట ఆగ్రో ఫారం పేరుమీద షాపులను దక్కించుకొన్నట్లు సీబీఐ గుర్తించింది. దీనిపై ఢిల్లీ, ఏపీలోని మాగుంట కార్యాలయాల్లో సీబీఐ సోదాలు చేపట్టి వుంది. అప్పట్లో ఆయన తన కంపెనీలు ప్రమేయం ఏమీ స్కాంలో లేవని పేర్కొని వున్నారు. లిక్కర్ స్కాం అనంతరం మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇక రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు పేర్కొన్నారు. తన స్థానాన్ని కుమారుడు రాఘవ రెడ్డి భర్తీ చేస్తాడని ఆయన పేర్కొని వున్నారు. అయితే కొంతకాలంగా ఏపీ సీఎం జగన్ పార్టీలో ఆయన పెద్దగా క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. భాజపాలో చేరేందుకు రంగం కూడా సిద్ధం చేసుకొన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సీబీఐ మాగుంట కుటుంబసభ్యులను విచారించడంతో శ్రీనివాసుల రెడ్డి రాజకీయ వారసుల చరిత్ర ఏ విధంగా మారనుందో వేచి చూడాల్సిందే.

అయితే నేడు ఢిల్లీ డిప్యూటీ సీఎంతోపాటు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడిని కూడా సీబీఐ విచారించడం కలకలం రేగుతోంది. ఇప్పటికే తెలంగాణలో తెరాస పార్టీకి చెందిన సీఎం కేసిఆర్ కూతురు కవిత హస్తం కూడా ఉన్నట్లు భాజపా నేతలు పేర్కొంటున్నారు. అయితే గత కొద్ది రోజులుగా కవిత పెద్దగా మీడియా ముందుకు రావడం లేదు. సరికదా నాన్న స్థాపించిన పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించిన రోజు సైతం కవిత గైర్హాజరు పై సర్వత్రా చర్చ సాగింది.

ఇది కూడా చదవండి: Viveka murder case: గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయండి.. సుప్రీం కోర్టును కోరిన సీబిఐ

Exit mobile version