Site icon Prime9

Crime News: టీఆర్ఎస్ కో ఆప్షన్ మెంబరు భర్త పై కేసు

TRS co-option member who ran Rasalilalu

TRS co-option member who ran Rasalilalu

Ameenpur: వావి, వరుసలు మరిచాడు. నమ్మకంగా ఉంటూనే మోసం చేసాడు. అంతేనా బరితెగించి మరో క్రిమినల్ వ్యవహారాన్ని చేపట్టాడు. చివరకు ఆ వ్యవహారం పై పోలీసులు కేసు నమెదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఘటన, అమీన్ పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకొనింది.

సమాచారం మేరకు, అమీన్ పూర్, బీరంగూడలో టీఆర్ఎస్ కో ఆప్షన్ మెంబరు భర్తగా ఫాస్టర్ శిఖామణి అందరితో పరిచయాలు చేసుకొంటుంటాడు. ఈ క్రమంలో వరుసకు బంధువు అయిన రాజు అనే వ్యక్తి భార్యతో శిఖామణి కలిసి ఉండడాన్ని భర్త రాజు గమనించాడు. వారిద్దరు ఒకటిగా ఉన్న సమయంలో తన సెల్ ఫోన్ లో రికార్డు చేశాడు. వివాహేతర సంబంధం విషయం కాస్తా మహిళ భర్త రాజుకు తెలుసుకొన్నాడని శిఖామణి గుర్తించాడు.

వెంటనే తన స్నేహితులతో కలిసి పక్కా ప్లాన్ వేశాడు. రాజును కిడ్నాప్ చేసి, అతని వద్ద వున్న మొబైల్ లోని అశ్లీల దృశ్యాలను డెలిట్ చేసేసాడు. 15రోజుల తర్వాత కిడ్నాపర్సు చెరనుండి తప్పించుకొన్న బాధితుడు రాజు అమీన్ పూర్ పోలీసులను ఆశ్రయించాడు. తన వద్ద మరో వీడియోను పోలీసులకు ఫిర్యాదుతోపాటు వారికి అందచేశాడు. చివరకు బాధితుని అక్క భర్త శిఖామణిగా ప్రాధిమికంగా గుర్తించిన పోలీసులు విచారణ ప్రారంభించారు. వ్యవహారం పై టీఆర్ఎస్ పెద్దల నుండి పోలీసులకు వత్తిడి ఉంటుందేమోనని బాధితుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.

ఇది కూడా చదవండి:  సుప్రీం కోర్టులో టీఆర్ఎస్ ఎంపీకి ఎదురుదెబ్బ

Exit mobile version