Site icon Prime9

Crime News: ప్రేమజంటపై గంజాయి బ్యాచ్ దాడి.. ప్రేమికుడి ముందే ప్రియురాలిపై అత్యాచారయత్నం

minor girl rape case in eluru district andhra pradesh

minor girl rape case in eluru district andhra pradesh

Crime News: మత్తులో పడితే జీవితాలు నాశనమవుతాయని వింటూనే ఉంటాం. అయితే ఈకోవకు చెందిన ఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రేమ జంటపై గంజాయి బ్యాచ్ రెడ్డి పోయింది. ముత్తులో ఉన్న ఇద్దరు యువకులు ప్రేమికుడి ముందే ప్రియురాలిపై దాడి చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా ముస్తాబాద్లో చోటుచేసుకుంది.

కృష్ణా జిల్లా ముస్తాబాద్‌లో గంజాయి మత్తులో ఓ ఇద్దరు యువకులు సైకోల్లా మారిపోయారు. ప్రేమ జంటపై దాడి చేశారు. యువకుడిని బంధించి మరీ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. దానితో బాధితురాలు కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు నిందితులను వెంబడించగా, నిందితుల్లో ఒకరిని పట్టుకున్నారు, మరొకరు పరారయ్యాడు. అంతేకాక నిందితులు వచ్చిన ఆటోను సైతం స్థానిక ప్రజలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ప్రేమ జంట నిర్మానుష్య ప్రాంతానికి వెళ్తుండడం గమనించిన గంజాయి బ్యాచ్ వారిని ఆటోలో వెంబడించారు. ఆ తర్వాత వారిపై దాడి చేసి వారి వద్దనున్న డబ్బులు సైతం లాక్కున్నారు. ఈ ఘటనపై యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేయగా, మరొకరి కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది వలస కూలీలు మృతి

Exit mobile version