Brutal Murder: హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా నరికి చంపారు.
హైదరాబాద్‌లోని పురానాపూల్ సమీపంలో జియాగూడ బైపాస్ రోడ్డుపై ఈ ఘటన జరిగింది.
@TelanganaDGP @hydcitypolice @HiHyderabad @swachhhyd
What is wrong with law and order in Hyderabad ?
Murder at New Road Ziaguda! pic.twitter.com/7z0n4McJYu
— Dr Mohammed Moinuddin Hasan Altaf (Team Rahul INC) (@moinaltaf1973) January 22, 2023
నడిరోడ్డుపై హత్య జరగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. జియాగూడ రహదారిపై ముగ్గురు వ్యక్తులు కత్తులు, వేట కొడవళ్లతో రణరంగం సృష్టించారు.
ఓ వ్యక్తిని నడిరోడ్డుపై వెంటాడి, వేటాడి మరీ నరికి చంపారు. సాయంత్రం అందరూ చూస్తుండగానే పురానాపూల్ సమీపంలో జియాగూడ బైపాస్ రోడ్డుపై ఈ దారుణ ఘటన జరిగింది.
జియాగూడ బైపాస్ రోడ్డుపై ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వెళ్తున్నాడు.. అతన్ని మరో ముగ్గురు తరుముకుంటూ వచ్చారు.
ఒక్కసారిగా చుట్టుముట్టి కత్తులు, వేట కొడవళ్లతో అత్యంత కిరాతకంగా హత్య చేశారు.
సమాచారం తెలుసుకున్న కుల్సుంపుర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.
మృతుడి ఆధార్ కార్డు వివరాల ప్రకారం.. కోఠి ఇస్తామియా బజార్‌కు చెందిన జంగం సాయినాథ్‌గా పోలీసులు గుర్తించారు.
ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
నిందితులు ఎవరు? ఎందుకు అతన్ని హత్య చేశారు? అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.
హత్య అనంతరం నిందితులు మూసీ నదిలో దూకి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు.
నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. హత్య జరిగిన సమయంలో ఘటనా స్థలంలో ఉన్న ఓ వ్యక్తి దూరం నుంచి వీడియో తీశారు.
ముగ్గురు చుట్టుముట్టి ఒక వ్యక్తిని కిరాతకంగా నరుకుతున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. పోలీసుల దర్యాప్తునకు ఈ వీడియో కీలకంగా మారింది.
హైదరాబాద్ (Hyderabad ) లో వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇందులో కొన్ని కక్షలు, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి.
ఎక్కువగా వివాహేతర సంబంధాల వల్ల ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి. నడి రోడ్డుపై అంత దారుణం జరుగుతున్నా ఏ ఒక్కరు కూడా.. ఆ దాడిని ఆపే ప్రయత్నం చేయలేదు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/