Site icon Prime9

Bride Commits Suicide: పెళ్లింట విషాదం.. నవ వధువు ఆత్మహత్య వరుడిపై కేసు నమోదు

bride commit suicide in Nizamabad

bride commit suicide in Nizamabad

Bride Commits Suicide: మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇళ్లంతా బంధుమిత్రులు ఎంతో సందడిగా ఉంది. అందరూ పెళ్లి పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. మరి కాసేపట్లో పెళ్లి మండపానికి రావడానికి నవ వధువు ముస్తాబవుతోంది. ఇంతలోనే ఆ పెళ్లింట ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. పెళ్లిపీటలపై ఉండాల్సిన నవవధువు ఫ్యానుకు వేలాడుతూ విగతజీవిగా మారింది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేటలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. మరికాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన రవళి అనే నవ వధువు గదిలోకి వెళ్లి తలుపులేసుకుని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు రవళికి మ్యారేజ్ జరుగనుంది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ ఉన్న ఇంట్లోకి వెళ్లిన వధువు రవళి పెళ్లికి ముస్తాబై ఇంట్లోనే సూసైడ్ చేసుకుంది. పెళ్లికి సమయం అవుతున్నా ఎంతసేపటి రవళి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు భయభ్రాంతులతో డోర్ ను బద్దలు కొట్టి లోపలి వెళ్లి చూసి అందరూ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. నవ వధువు అలంకరణలో ఉన్న రవళి ఫ్యాన్ కు వేళాడుతూ విగతజీవిగా కనిపించింది. దానితో కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరుగా విలపించారు.

రవళి చనిపోయే కొద్దిసేపటి ముందు వరుడు, వధువుతో పాటు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌ తో కూడా డ్యాన్స్‌లు చేశారు. అప్పటి వరకు తమ కళ్లముందే వున్న వధువు ఆత్మహత్య చేసుకోవడంతో పెళ్లింట విషాదం నింపింది. అయితే రవళి ఆత్మహత్యకు ముందు చివరి సారిగా వరుడితో ఫోన్ కాల్ మాట్లాడినట్లు తండ్రి పేర్కొన్నారు. వరుడు వేధింపులే ఆత్మహత్య కు కారణమని రవళి తండ్రి ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో వధువు తండ్రి ఫిర్యాదు మేరకు 306 కింద కేసు నమోదు చేశారు నవిపేట పోలీసులు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పట్టపగలు బెడ్‌రూమ్ నుంచి యువతి కిడ్నాప్.. సుమారు 100 మంది వచ్చి… కొట్టి ఎత్తుకెళ్లిన వైనం !

Exit mobile version