Site icon Prime9

Viral News: పాము కాటేసిన బాలుడు సేఫ్.. బాలుడు కొరిన పాము మృతి

boy bite a snake in Chhattisgarh

boy bite a snake in Chhattisgarh

Viral News: పాములను చూస్తే సాధారణంగా ప్రజలు చాలా భయపడుతూ ఉంటారు. కొందరైతే పాము అనే పేరు వినడానికి కూడా చాలా వణికిపోతూ ఉంటారు. అలాంటి ఒక పాము వచ్చి కాటేస్తే ఇంకేముంది హడలిపోతూ పరుగుపరుగున ఆసుపత్రికి వెళ్తారు. కానీ ఇందుకు భిన్నంగా ఒక 12 ఏళ్ల కుర్రాడు మాత్రం తనను పాము కాటేసిందని దానిపై కోపంతో ఊగిపోయాడు. అక్కడి నుంచి జరజరా పాకుతూ వెళ్లిపోతున్న ఆ పామును పట్టుకుని తన పంటితో కసితీరా కొరికేశాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పాము కాటేసిన బాలుడు మరణించలేదు కానీ బాలుడు కొరికిన పాము మాత్రం మరణించింది. ఈ షాకింగ్ ఘటన ఎక్కడ జరిగిందో ఈ కథనం ద్వారా చూసెయ్యండి.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని జశ్‌పుర్‌ జిల్లా పంద్రపుత్‌ గ్రామంలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. పహాఢీ కోర్వా గిరిజన తెగకు చెందిన దీపక్‌ రామ్‌ (12) అనే బాలుడు తమ నివాసానికి సమీపంలో ఉన్న సోదరి ఇంటి వద్ద తోటి స్నేహితులతో ఆడుకుంటున్నాడు. సరిగ్గా ఆ సమయంలో అక్కడకు బుసలు కొడుతూ వచ్చిన ఓ పాము అతని చేతిపై కాటు వేసింది. దానితో కోపంతో ఊగిపోయిన దీపక్‌ పారిపోతున్న పామును పట్టుకుని గట్టిగా కొరికి చంపేశాడు. ఈ విషయాన్ని వెంటనే తన కుటుంబ సభ్యులకూ చెప్పాడు. దానితో దీపక్‌ను అతని సోదరి, తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. పాము విషానికి విరుగుడు ఇవ్వడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి: ఓ మంచి దొంగ.. “క్షమాపణ కోరుతూ మెయిల్ “

Exit mobile version
Skip to toolbar