Prime9

Youth died: జలపాతంలో నీటమునిగి ఆంధ్ర యువకుడు మృతి…

Mulugu, Telangana: విహార యాత్ర అతనిపాలిట మృత్యువుగా మారింది. స్నేహితులతో సరదా కాస్తా నిండు ప్రాణాన్ని బలిగొన్న ఆ ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకొనింది.

పోలీసుల సమాచారం మేరకు, విజయవాడ ఉయ్యూరు కు చెందిన అనిల్ కృష్ణ (25) హైదరాబాదు గచ్చబౌలిలోని ఓ ప్రైవేటు సంస్ధలో పనిచేస్తున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో స్నేహితుల కలిసి బోగత జలపాతానికి విహారయాత్రకు వెళ్లాడు. సెలయేరు ప్రాంగణంలో స్నానాలు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు అనిల్ కాలుజారి నీటి పడిపోయాడు.

ప్రాణాలకు తెగించిన స్నేహితులు అనిల్ కృష్నను ఒడ్డుకు చేర్చారు. అయితే అప్పటికే నీళ్లను తాగి కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న అనిల్ ను హుటాహుటిన వాజేడు వైద్యశాలకు తరలించారు. అప్పటికే యువకుడు మృతి చెందిన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో విషాదఛాయలు అలుముకొన్నాయి. సమాచారాన్ని అనిల్ కుటుంబసభ్యులకు చేరవేశారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ఇది కూడా చదవండి: Hyderabad: జరభద్రం.. గీజర్ పేలి నవదంపతులు మృతి

Exit mobile version
Skip to toolbar