Site icon Prime9

Rajasthan: కొడుకు కోసం కూతుర్ని బలి ఇచ్చిన తల్లి

mother

mother

Rajasthan: రాజస్థాన్ బరన్ జిల్లాలోని అంట పట్టణంలో ఓ తల్లి తన 13 ఏళ్ల కూతురిని గొంతుకోసి హత్య చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన పెద్ద కొడుకు ఆరోగ్యం బాగుండాలని కూతురిని హత్య చేసింది. దీనికి సంబంధించి వివరాలివి. రేఖ హదా అనే మహిళ భర్త శివరాజ్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ దంపతులకు 16,13 ఏళ్ల వయస్సున్న ఇద్దరు కొడుకులు, 12 ఏళ్ల సంజన అనే కుమార్తె ఉన్నారు.

శనివారం పెద్ద కుమారుడు నాగేంద్ర సింగ్ (16) పాఠశాలకు వెళ్లాడు. కుమార్తె సంజన (13), ఆమె తమ్ముడు సింగం (11) పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో రేఖ సంజన, సింగంలను కొట్టడం ప్రారంభించింది. సింగం పారిపోయాడు. తర్వాత రేఖ లోపలి నుంచి గడియ పెట్టుకుంది. అనంతరం కూతురు సంజనను టవల్‌తో గొంతుబిగించి హత్య చేసింది. సంజన 5వ తరగతి చదువుతుండేది. సోదరి గది నుండి బయటకు రాకపోవడంతో, తమ్ముడు సింగం బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు. అతని అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. తల్లి చెల్లిని కొడుతుందని వారికి చెప్పాడు. దీంతో జనం తలుపు తట్టారు. అయితే తలుపు లోపలి నుంచి లాక్ చేయబడి ఉండటంతో జనం తలుపులు పగలగొట్టి చూడగా సంజన నేలపై పడి ఉంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు.నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను విచారించగా వేరే విషయం బయటపడింది. పెద్ద కుమారుడికి గుండెలో రంధ్రం ఉన్న వ్యాధి ఉందని నిందితురాలు చెప్పినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తరుకాంత్ సోమాని తెలిపారు.

అందుకే తన కుమారుడి ఆరోగ్యం మెరుగవ్వాలంటే ఎవరైనా ఒకరిని బలి ఇవ్వాలని ఆమె అనుకుంటూ ఉండేది. ఈ క్రమంలో గతంలో ఒక సారి భర్తపైనే దాడి చేసింది. మూఢ విశ్వాసంతో ఇలాంటి చర్యకు పాల్పడిందని ఆ సమయంలో ఆమె భర్తకు అర్థం కాలేదు. రేఖ మానసికంగా దెబ్బతిందని భావిస్తున్నారు. ఈ దారుణమైన ఘటనతో స్థానికంగా అందరు భయాందోళనకు గురయ్యారు.

 

Exit mobile version