Site icon Prime9

Assam Crime: గొంతు కోసి బ్యాగ్ లో కుక్కి ప్రేమోన్మాది కిరాతకం.. కానీ ఆఖరుకి..!

father and son brutally murder in uppal

father and son brutally murder in uppal

Assam Crime: ఏపీలో నిన్న అనగా శనివారం నాడు తన ప్రేమను నిరాకరించిందని ఓ అభాగ్యురాలి గొంతుకోశాడు ఓ ప్రేమోన్మాది. ఇలాంటి ఘటనే తాజాగా మరొకటి చోటుచేసుకుంది. తను ప్రేమిస్తున్న అమ్మాయి మరెవరితోనో దుర్గా పూజకు వెళ్లిందని ఓ కిరాతకుడు ఆమెను కిడ్నాప్‌ చేశాడు. అంతటితో ఆగక ఆమెను రేప్‌ అనంతరం  తన గొంతు కోసి ఆమెను బ్యాగ్ కుక్కి సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేసి వెళ్లిపోయాడు. ఈ దారుణ ఘటన అసోంలో చోటుచేసుకుంది.

అసోం రాష్ట్రంలోని కచార్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తను ప్రేమిస్తున్న అమ్మాయి వేరే వాళ్లతో దుర్గా పూజకు వెళ్లిందని ఆమెను అతి కిరాతంగా చంపేశాడు ఓ దుర్మార్గుడు. ఆమె చనిపోయిందనుకొని ఆమెను ఓ బ్యాగ్‌లో కుక్కి ఆ బ్యాగ్‌ను సమీప అటవీ ప్రాంతంలో పడేసి వెళ్లిపోయాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ బాలిక చనిపోలేదు. స్పృహ వచ్చాక బ్యాగ్లో నుంచి బయటకు వచ్చి సమీపంలోని గ్రామంలోకి వెళ్లింది. స్థానికులు ఆమెను చూసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కాగా బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 6వ తేదీన నిందితున్ని అరెస్టు చేశారు.

ఇదీ చదవండి: వైకాపా అసమ్మతి నేత దారుణ హత్య.. వేటకొడవళ్లతో వెంటాడి మరీ..!

Exit mobile version