Prime9

Hyderabad Murder: హైదరాబాద్ లో పండగపూట విషాదం.. యువకుడి దారుణ హత్య

Hyderabad Murder: పండగ పూట హైదరాబాద్ లో ఘోరం చోటు చేసుకుంది. ఓ యువకుడిని ముగ్గురు వ్యక్తులు కలిసి అత్యంత దారుణంగా పొడిచి  చంపారు. ఈ ఘటన నగరంలోని లంగర్ హౌజ్ లో చోటు చేసుకుంది. హత్యకు కారణం ప్రేమ వివాహమే అని పోలీసులు ప్రాథమిక అంచన వేస్తున్నారు.

రాష్ట్ర రాజధానిలో దారుణ హత్య జరిగింది. లంగర్ హౌజ్ లో ఓ యువకుడిని ముగ్గురు వ్యక్తులు.. కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు.

పండగపూట విషాదం

మృతి చెందిన యువకుడిని 25 ఏళ్ల కలీమ్ గా పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనలో కలీమ్ అక్కడికక్కడే మృతి చెందాడుmurder యువకుడి హత్యతో  స్థానికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వివరాలు సేకరించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

మృతుడు ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రేమ వివాహమే కారణమా?

ఈ హత్యకు ఇదే కారణమా? లేక మరే ఇతర కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
ఇక హత్య అనంతరం నిందితులు పోలీసులు ఎదుట లొంగిపోవడం కొసమెరుపు. హత్య తర్వాత అనూహ్యంగా పోలీసుల ఎదుట నిందితులు లొంగిపోయారు.

యువకుల మధ్య వ్యక్తిగత కారణాల.. ప్రేమ వివాహమా అనేది తెలియాల్సి ఉంది.

ఈ కేసులో నిందితులు ఎలాంటి నిజాలు చెబుతారో వేచి చూడాలి. ఇదిలా ఉండగా.. రాజధానిలో ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది.

ఇక నగరంలో జరుగుతున్న వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి.

ఆస్తి వివాదాలు, భూతగాదాలు, ప్రేమ వివాహాలు వంటి ఏవైనా సరే.. క్షణికావేశంలో హత్యలకు పాల్పడుతున్నారు.

పగ కోసం వారి జీవితాలను జైలు పాలు చేసుకుంటున్నారు. క్షణిక కోపంలో తమ కుటుంబాలకు దు:ఖాన్ని మిగుల్చుతున్నారు.

నేరాల నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెస్తున్న నిందితుల్లో మార్పు రావట్లేదు.

పోలీసులు సరైన శిక్షలు అమలు చేయడం లేదని కొందరు వాపోతున్నారు.

ఇకనైనా నేరాల నియంత్రణకు పోలీసులు సరైన చర్యలు తీసుకోవాలని కోరుకతున్నారు.

ఇలాంటి ఘటనలు వరుసగా నగరంలో చోటు చేసుకుంటున్నాయి.

నడిరోడ్డుపై హత్యలు జరుగుతున్న చూస్తు ఉండిపోతున్న స్థానికులు.

ప్రేమ వివాహలు చేసుకునేవారికి రక్షణ కల్పించాలని డిమాండ్.

Electronic Voting : ఢిల్లీలో ఈసీ కార్యాలయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ | Prime9 News

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar