Warangal: బాలుడి ప్రాణం తీసిన చాక్లెట్

విదేశాల నుంచి ఎంతో ప్రేమగా తీసుకువచ్చిన చాక్లెట్‌ తన కుమారుడి ప్రాణం తీస్తుందని ఆ తండ్రి ఊహించలేకపోయాడు. చాక్లెట్‌ గొంతులో ఇరుక్కొని ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన వరంగల్‌ నగరంలో జరిగింది.

Warangal: విదేశాల నుంచి ఎంతో ప్రేమగా తీసుకువచ్చిన చాక్లెట్‌ తన కుమారుడి ప్రాణం తీస్తుందని ఆ తండ్రి ఊహించలేకపోయాడు. చాక్లెట్‌ గొంతులో ఇరుక్కొని ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన వరంగల్‌ నగరంలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌కు చెందిన కంగర్‌సింగ్‌ బతుకుతెరువు కోసం వరంగల్‌ వచ్చి స్థిరపడ్డారు. డాల్ఫిన్‌ గల్లీలో ఓ ఎలక్ట్రికల్‌ దుకాణాన్ని నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.  కాగా తన ముగ్గురు చిన్నారులు నగరంలోని స్థానిక స్థానిక శారద పబ్లిక్‌ స్కూల్‌లో చదువుతున్నారు. ఇటీవల కంగర్‌సింగ్‌ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి తిరిగొచ్చారు. అయితే ఆస్ట్రేలియా నుంచి తన పిల్లల కోసం చాక్లెట్స్ కొన్ని తీసుకొచ్చారు. శనివారం పిల్లలు స్కూల్‌కు వెళ్లే క్రమంలో విదేశాల నుంచి తండ్రి తీసుకొచ్చిన చాక్లెట్‌ను వారికి ఇచ్చారు. కాగా వారిలో రెండో తరగతి చదువుతున్న కుమారుడు సందీప్‌ (8) స్కూల్‌కు వెళ్లి చాక్లెట్‌ తినేందుకు నోట్లో వేసుకున్నాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే కింద పడిపోయాడు. గమనించిన పాఠశాల సిబ్బంది తండ్రికి సమాచారం అందించగా వారు వచ్చి బాలుడిని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అయితే గొంతులో చాక్లెట్‌ను గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తుండగానే సందీప్‌ మృతిచెందాడు. బాలుడి మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

ఇదీ చదవండి: అయ్యప్ప మాలలో ముస్లిం టోపీ ధరించిన మాజీమంత్రి.. బీజేపీ నేతలకు స్ట్రాంగ్ క్లారిటీ