Site icon Prime9

Gang Rape: 8వ తరగతి బాలికపై గ్యాంగ్ రేప్..!

minor girl rape case in eluru district andhra pradesh

minor girl rape case in eluru district andhra pradesh

Gang Rape: రోజురోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులపై మృగాళ్ల విరుచుకుపడుతున్నారు. ఎన్ని చట్టాలు చేసినా ఈ కామాంధులు అరాచకాలకు అడ్డుకట్ట పడకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా తాజాగా వైఎస్సార్ కడప జిల్లాలో ఓ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్‌ కలకలం రేపుతుంది.

ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని గోపవర మండలం రాచాయపేటలో ఎనిమిదో తరగతి చదివే ఓ విద్యార్థినిపై కొందరు సామాహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను నిందితులు ఫోన్‌లో రికార్డు చేసి మరీ ఆ బాలికపై పలుమార్లు లైంగికదాడి చేశారు. అయితే ఈ దారుణానికి పాల్పడింది కూడా మైనర్లేనని వారు పది, ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి రావడం జరిగింది. పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి: వివాహితను బైక్​తో ఢీ కొట్టి.. ఆపై అత్యాచారం..!

Exit mobile version