Site icon Prime9

Road Accidents: ఘోర రోడ్డు ప్రమాదాలు.. 7 మంది దుర్మరణం

road accindents in adilabad and medchal

road accindents in adilabad and medchal

Road Accidents: తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆదిలాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు.

వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్‌ జిల్లాలోని గుడిహత్నూర్‌ మండలం సింతాగొంది సమీపంలో కారు అదుపుతప్పి కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. హైదరాబాద్‌ నుంచి ఆదిలాబాద్‌ వెళ్తుండా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. మృతులను డ్రైవర్‌ శంశు, సయ్యద్‌ రఫీతుల్లా, వజహబ్‌ హస్మి, సలీమాగా గుర్తించారు.

ఇదిలా ఉండగా హైదరాబాద్‌ శివార్లలోని ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో మరో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన టెంపో వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో టెంపోలో ఉన్న ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: కేబుల్ బ్రిడ్జ్ ప్రమాదంలో.. 132 మంది మృతి

Exit mobile version