Delhi: దేశ రాజధాని దిల్లీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాత్రి సమయాల్లో దోమల నివారణకు ఉపయోగించిన మస్కిటో కాయిల్.. ఓ కుటుంబంలోని ఆరుగురి ప్రాణాలను బలితీసుకుంది. ఇందులో ఓ చిన్నారి కూడా ఉంది. వీరు మస్కిటో కాయిల్ ప్రభావం వల్లనే మరణించారా.. లేదా మరే కారణం ఉందా అనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది.
దేశ రాజధాని దిల్లీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాత్రి సమయాల్లో దోమల నివారణకు ఉపయోగించిన మస్కిటో కాయిల్.. ఓ కుటుంబంలోని ఆరుగురి ప్రాణాలను బలితీసుకుంది. ఇందులో ఓ చిన్నారి కూడా ఉంది. వీరు మస్కిటో కాయిల్ ప్రభావం వల్లనే మరణించారా.. లేదా మరే కారణం ఉందా అనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది.
మస్కిటో కాయిల్ ఆరుగురి ప్రాణం తీసిన ఘటన దిల్లీలో చోటు చేసుకుంది. మస్కిటో కాయిల్ వల్ల తొలుత మంటలు చెలరేగాయి. దాని తర్వాత వెలువడిన విష వాయువులను పీల్చడంతో.. ఊపిరాడక ఒకే కుటుంబంలో ఆరుగురి ప్రాణాలు గాల్లో కలిశాయి. మృతి చెందిన వారిలో.. ఏడాదిన్నర చిన్నారి కూడా ఉండటం తీరని విషాదాన్ని నింపింది.
ఈశాన్య దిల్లీలో గల శాస్త్రి పార్క్ ప్రాంతంలో బాధిత కుటుంబం నివాసం ఉంటుంది. రాత్రి దోమల నివారణకు.. ఇంట్లో మస్కిటో కాయిల్ అంటించి పడుకున్నారు. అది కాస్త పరుపుపై పడి అంటుకుని పొగ వ్యాపించింది. కిటికీలు, తలుపులు మూసి ఉండంటంతో వారు తప్పించుకోలేకపోయారు. పొగ కాస్త విష వాయువుగా మారి ఊపిరాడక వారు మృతి చెందారు. ఉదయం స్థానికులు గమనించి.. పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని చూడగా.. ఆ ఇంట్లో ఆరుగురు విగతవీవులుగా కనిపించారు. ముగ్గురిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. వారి మృతికి కార్బన్ మోనాక్సైడ్ వెలువడటంతోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.