Site icon Prime9

Chain Snatching: రెండు గంటలు.. ఆరు స్పాట్లు.. హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న చైన్ స్నాచర్లు CCTV ఫుటేజ్ రిలీజ్

chain snatchers హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్ కేసులు

chain snatchers

Chain Snatching: హైదరాబాద్‌లో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. రెండు గంటల వ్యవధిలోనే ఆరు చోట్ల స్నాచింగ్‌కు పాల్పడ్డారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉప్పల్, నాచారం, ఉస్మానియా యూనివర్సిటీ, రాంగోపాల్‌ పేట్ సహా మొత్తం ఆరు చోట్ల ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. నడిచి వెళ్లే వారిని టార్గెట్ గా చేసుకున్న ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైక్ పై తిరుగుతూ చోరీలకు పాల్పడ్డారు. ఉప్పల్ లో స్నాచింగ్ మొదలు పెట్టిన దుండగులు రాంగోపాల్ పేటలో ముగించారు. చోరీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చోరీల అనంతరం బైక్ ను రాంగోపాల్ పేటలో వదిలివెళ్లారు దొంగలు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు.

చోరీలు ఎలా జరిగాయంటే..

ఉదయం 6:20కి ఉప్పల్‌లోని రాజధాని కాలనీలో మొదటి స్నాచింగ్‌

6.40కి ఉప్పల్‌లోని కల్యాణ్‌పురి కాలనీలో

7.10 కి నాచారంలోని నాగేంద్రనగర్‌ లో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ మెడలో మంగళసూత్రం చోరీ

7.40గం.కి ఓయూ పరిసరాల్లోని రవీంద్రనగర్‌లో స్నాచింగ్(Chain Snatching)

8 గంటలకి చిలకలగూడ రామాలయం వీధిలో వాకింగ్ కు వెళ్తున్న జ్యోతి బెన్ అనే మహిళ మెడలో నుంచి రెండు తులాల బంగారు చైన్ స్నాచింగ్(Chain Snatching)

8.10కి రాంగోపాల్ పేట్‌ పీఎస్ , రైల్వే స్టేషన్ సమీపంలో దుండగులు చోరీకి తెగబడ్డారు.

పోలీసుల అలెర్ట్

గంటల వ్యవధిలో జరిగిన వరుస దొంగతనాలతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. సంఘటనలు జరిగిన ప్రాంతల్లో కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. చైన్ స్నాచ‌ర్స్ కోసం 10 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. దుండగులు వాడిన బైక్ కూడా దొంగిలించనట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. వరుస ఘటనల నేపథ్యంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

ఇవీ చదవండి

Joshimath: కుంగిపోతున్న నగరం.. భయం భయంగా ప్రజలు.. జోషిమఠ్‌లో ఏం జరుగుతుందంటే..?

Air India: ఎయిర్ ఇండియా విమానంలో మూత్రవిసర్జన కేసు.. నిందితుడిని ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ

Supreme Court : ’గే‘ మ్యారేజెస్ పై సుప్రీం కీలక నిర్ణయం…

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version