Bihar: ఓ ప్రధానోపాధ్యాయుడి మూర్ఖత్వానికి 200 మంది విద్యార్ధులు ఆసుపత్రి పాలైన ఘటన బీహార్ లో చోటుచేసుకొనింది. సమాచారం మేరకు బిహార్ లోని భాల్పూర్ లోని ఓ పాఠశాల విద్యార్ధులు మధ్యాహ్న భోజనం తిన్నారు. ఆ సమయంలో ఓ విద్యార్ధి ప్లేటులో చనిపోయిన బల్లి కనిపించింది. బల్లి ఉన్న విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లారు. అయితే దాన్ని కొట్టిపారేసి, బల్లిని వంకాయిగా బుకాయించి వారిని అక్కడ నుండి పంపేశాడు. బలవంతంగా విద్యార్దుల చేత భోజనాన్ని తినిపించాడు.
అనంతరం ఓ గంట తర్వాత విద్యార్ధులు అస్వస్ధతకు గురైనారు. వాంతులు చేసుకోవడంతో అనారోగ్యానికి గురైనారు. వెంటనే స్థానిక వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకొన్న విద్యాశాఖ, పోలీసు అధికారులు ఆసుపత్రికి చేరుకొన్నారు. జరుగుతున్న చికిత్సపై ఆరాతీశారు. ప్రధానోపాధ్యాయుడు తప్పు చేసిన్నట్లు తేలితే అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో వాస్తవాలు తెలుసుకొనే పనిలో పడ్డారు.
ఇది కూడా చదవండి: Aadhar Card: ఆధార్ అప్డేట్ తప్పనిసరి.. యూఐడీఏఐ వెల్లడి