Site icon Prime9

Hyderabad: పదో తరగతి విద్యార్థినిపై స్నేహితుల గ్యాంగ్ రేప్.. వీడియో తీసిమరీ..!

10th class girl gangraped in hyderabad

10th class girl gangraped in hyderabad

Hyderabad: ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని శిక్షలు విధించిన కామాంధులు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. చిన్నాపెద్ద తేడాలేకుండా పసి పిల్లలనుంచి పండు ముసలి వాళ్లపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. రోజూ ఏదో ఒక మూల ఎంతోమంది బాలికలు, మహిళలు లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చింది.

హయత్ నగర్ తట్టిఅన్నారంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఐదుగురు తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఈ వికృతాన్ని వీడియో కూడా తీశారు. ఈ విషయం గురించి ఎవరికైనా చెపితే వీడియోను నెట్టింట బయటపెడతామని బాధితురాలిని బెదిరించారు. ఈ ఘటన జరిగిన 10 రోజుల తర్వాత ఆమెపై మరోసారి వీరంతా గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ వీడియోను మరికొందరు తోటి విద్యార్థులకు పంపారు. దానితో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కాగా బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచారం, పోక్సో సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఆర్థిక ఇబ్బందులతో రెండేళ్ల కూతురిని చంపేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్

Exit mobile version