Site icon Prime9

Tata’s eye on smartphone manufacturing? స్మార్ట్ ఫోన్ తయారీపై టాటా కన్ను?

Tata's eye on smartphone manufacturing

Tata's eye on smartphone manufacturing

Tata’s eye on smartphone manufacturing: “టాటా” ఆ పేరు తెలియని భారతీయుడు ఎవ్వరూ ఉండరూ…అన్ని రంగాల్లో, వ్యవస్ధల్లో టాటా గ్రూపు ఆఫ్ కంపెనీస్ భాగస్వామ్యం ఉంటూనే ఉంటుంది. దేశానికి కీలకమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్టీల్, ఆటోమొబైల్ రంగాలు టాటా గ్రూపుకు మంచి గుర్తింపు తెచ్చిన పరిశ్రమలుగా చెప్పుకోవచ్చు…సామాన్యుడి చెంతకు బుడ్డ కారు అంటూ నానో కారుతో దేశంలో ప్రకంపనలు సృష్టించిన టాటా గ్రూప్ ఇండియాలో స్మార్ట్ ఫోన్ తయారీపై కన్ను పడిందని పరిశ్రమ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.

లభించిన సమాచారం మేరకు….సాంకేతికతపై పట్టు సాధించి ఫోన్ దిగ్గజంగా పేరొందిన పరిశ్రమల్లో ఒకటైన ‘ఐ’ ఫోన్ తయారీ అసెంబ్లింగ్ యూనిట్ భారత్ లో ఏర్పాటు చేసేందుకు టాటా గ్రూపు ప్రయత్నిస్తుంది. తైవాన్ కు చెందిన విస్ట్రన్ కార్పొరేషన్ అనే కంపెనీ భాగస్వామ్యంతో ఇండియాలో ఎలక్ట్రానిక్ జాయింట్ తయారీ ఫ్లాంట్ ఏర్పాటు చేయాలని టాటా గ్రూపు భావిస్తుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన వ్యవహారాలపై జోరుగా రెండు వర్గాల్లో చర్చలు సాగుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయ్.

యాపిల్ సంస్ధకు చెందిన ఐ ఫోన్ల తయారీ ఇప్పటివరకు విస్ట్రన్ కార్పొరేషన్, ఫాక్స్ కాన్ టెక్నాలజీ సంస్ధలు చేపడుతున్నాయ్.. ప్రధాన దేశాలైన భారత్, చైనాలో మాత్రం ఐ ఫోన్ పేరుతో అసెంబ్లింగ్ చేస్తున్నారు. కరోనా ముందు వరకు ప్రపంచ వ్యాప్తంగా ఫోన్ తయారీలో చైనా ముందుంటుంది…అందుకనే ఫోన్ల తయారీలో చైన్ అతి పెద్ద పరిశ్రమల తయారీ  కల్గిన దేశంగా పేరొందింది…అయితే పరిస్ధితులు మారడంతో చైనాతో వాణిజ్య వ్యాపారుల చేపట్టేందుకు పలు దేశాలు విముఖుత చూపిస్తునాయి. దీంతో చైనాతో పాటుగా ఇతర దేశాల్లో కూడా యాపిల్ ఉత్పత్తులు తయారు చేసేందుకు యాపిల్ సంస్ధ చేపట్టిన ఆలోచనలో భాగంగానే టాటా గ్రూప్ విస్ట్రన్ గ్రూపుతో సంప్రదింపులు జరిగివుండవచ్చని పరిశ్రమల వర్గాలు చర్చించుకొంటున్నాయ్..

రెండు కంపెనీలు కలిసి కొత్త అసెంబ్లీ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తారా లేదా విస్ట్రన్ ఇండియాలో టాటా గ్రూపు ఈక్విటీలు కొనుగోలు చేసే అవకాశాలు అధికంగా ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే ఇరు కంపెనీల సంప్రదింపులపై మాత్రం ఇరు వర్గాల నుండి మౌనమే సమాధానంగా వస్తుంది. 2017 నుండి విస్ట్రన్ కార్పొరేషన్ కంపెనీ ఇండియాలో ఐ ఫోన్ల తయారీ చేస్తుంది. భారత్ దేశంలో ఫోన్లపై వున్న మక్కువ దృష్ట్యా ‘ఐ’ ఫోన్ల తయారీని 4 నుండి 5 రెట్లు పెంచడమే యాపిల్ సంస్ధ ఉద్దేశంగా చర్చ సాగుతుంది. ఏది ఏమైనా పేరొందిన ట్రాటా గ్రూపు ఫోన్ల తయారీపై దృష్టి సారించిందన్న వార్తలు వినియోగదారులకు మంచి కిక్ ను ఇచ్చిన్నట్లైయింది.

Exit mobile version
Skip to toolbar