Site icon Prime9

Starbucks: మన రుచులను మెచ్చిన “స్టార్ బక్స్” సీఈవో.. విద్యార్థి భవన్లో ఫిల్టర్ కాఫీకి ఫిదా

starbucks ceo tasted bengaluru vidhyardhi bhavan dosa and filter coffee

starbucks ceo tasted bengaluru vidhyardhi bhavan dosa and filter coffee

Starbucks: బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ అయిన విద్యార్థి భవన్‌ కు గురువారం అనుకోని అతిథి వచ్చారు. స్టార్‌బక్స్ సహ వ్యవస్థాపకుడు జెవ్ సీగల్ రెస్టారెంట్‌ని సందర్శించి వారి ప్రసిద్ధ వంటకాలైన మసాలా దోశ మరియు ఫిల్టర్ కాఫీని ప్రయత్నించారు. ఈ విషయాన్ని విద్యార్థి భవన్ వారు నెట్టింట పోస్ట్ చేసి వెల్లడించారు.

నగరంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2022లో పాల్గొనేందుకు సీగల్ బెంగుళూరు వచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థి భవన్ కు వచ్చి తమ ఫుడ్ ని టేస్ట్ చేశారని సోషల్ మీడియాలో, విద్యార్థి భవన్ తెలిపింది. “నవంబర్ 3వ తేదీ సాయంత్రం విద్యార్థి భవన్‌లో స్టార్‌బక్స్ తమ కస్టమర్ గా స్టార్ బక్స్ సహ వ్యవస్థాపకుడు మిస్టర్ జెవ్ సీగల్‌ను కలిగి ఉన్నందుకు మేము సంతోషంగా మరియు గర్వంగా ఉన్నాము. అతను మా మసాల దేశ మరియు ఫిల్టర్ కాఫీని ఆస్వాదించాడు మరియు మా అతిథి పుస్తకంలో  ఫుడ్ రివ్యూ మరియు రేటింగ్ కూడా ఇచ్చారని ”అని పేర్కొంది.

అతిథి పుస్తకంలో, సీగల్ “నా స్నేహితులారా, మీ ప్రసిద్ధ ఆహారం, కాఫీ మరియు మీ సాదరమైన స్వాగతాన్ని ఆస్వాదించడం నాకు గౌరవం. నేను ఈ అద్భుతమైన అనుభవాన్ని నాతో తిరిగి సీటెల్‌కు తీసుకువెళతాను. ధన్యవాదాలు.” అని రాసి ఇక్కడి ఫుడ్ కు త్రీ స్టార్ రేటింగ్ ఇచ్చారని స్టీమింగ్ కప్పు కాఫీని కూడా డూడుల్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది విద్యార్థి భవన్.

ఇదీ చదవండి: ట్విట్టర్ చార్జీల్లో డిస్కౌంట్ లేదా మస్క్?.. జొమాటో క్రేజీ ట్వీట్

Exit mobile version