Site icon Prime9

Samsung: శామ్ సంగ్ ‘బ్లాక్ ఫ్రైడే’ సేల్.. తక్కువ ధరలకే స్మార్ట్ ఫోన్లు

samsung-black-friday-sale-to-start-from-november-24

samsung-black-friday-sale-to-start-from-november-24

Samsung: శామ్ సంగ్ ఎట్టకేలకు బ్లాక్ ఫ్రైడే సేల్ ను ప్రకటించింది. శామ్ సంగ్ తన స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ట్యాబ్లెట్లు, గెలాక్సీ బడ్స్, గెలాక్సీ వాచ్ పై డిస్కౌంట్స్ ను ఆఫర్ చేయనుంది. ఈ సేల్ ఈ నెల 24 నుంచి 28 వరకు కొనసాగుతుంది.

శామ్ సంగ్ గెలాక్సీ ఎస్22 ప్లస్, గెలాక్సీ ఎస్22, ఎస్ 22 అల్ట్రా స్మార్ట్ ఫోన్ల ధరలు సాధారణ రోజుల్లో రూ.72,999 నుంచి ప్రారంభమవగా బ్లాక్ ఫ్రైడే సేల్ లో రూ.60,000 నుంచి అందుబాటులో ఉంటాయి. ఇక గెలాక్సీ జెడ్ సిరీస్ ఫోన్లు ధరలు సాధారణ రోజుల్లో రూ.80,999 నుంచి మొదలవుతుంటే, ఈ సేల్ లో రూ.67,999 నుంచి లభించనున్నాయి.

ఇక గెలాక్సీ ఎస్ సిరీస్ 5జీ ఫోన్ ధరలు రూ.31,999 నుంచి రూ.42,999 మధ్య ఉంటాయి. పాత ఫోన్లను ఎక్సేంజ్ చేసుకోవడం ద్వారా కొత్త ఫోన్లపై మరింత తగ్గింపు పొందొచ్చు. అలాగే, హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్ బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది.

ఇదీ చదవండి: అదిరిపోయే ఫీచర్లతో Vivo X90 స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది..!

Exit mobile version