Site icon Prime9

Elon Musk: ట్విట్టర్ కొనుగోలుకే మస్క్ ఆసక్తి..!

is-twitter-going-to-charge-a-subscription-fee

is-twitter-going-to-charge-a-subscription-fee

Elon Musk: ట్విట్టర్‌ కొనుగోలుపై ఎట్టకేలకు టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఓ దారికొచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక్కో ట్విట్టర్‌ షేరును 54.20 డాలర్ల చొప్పున 4,400 కోట్ల డాలర్లకు కొనేందుకు అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

కాగా ఈ వార్తతో ట్విట్టర్‌ షేర్లు ఒక్కసారిగా లాభాలబాటలో పయనిస్తున్నాయి. మంగళవారం ఒక్కసారిగా షేర్లు 13 శాతం పెరిగి 47.95 డాలర్లకు చేరాయి. దానితో ఈ కౌంటర్‌లో ట్రేడింగ్‌ నిలిపివేశారు. గత కొంతకాలంగా ట్విట్టర్లో ఫేక్ అకౌంట్లే ఎక్కువని మస్క్ ఆరోపించిన సంగతి విదితమే. కాగా ట్విట్టర్లో ఈ నకిలీ ఖాతాల విషయం కోర్టులో నిరూపించడం కష్టమని తేలడంతో ఎలాన్ మస్క్‌ ఈ నిర్ణయానికి వచ్చినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: ఎయిర్ టెల్ యూజర్లకు భారీ షాక్.. ఆ ఫోన్లకు 5జీ అందడం లేదు

Exit mobile version