Site icon Prime9

Uttarakhand: పెళ్లింట విషాదం.. లోయలో పడి 25 మంది మృతి

bus accident in Uttarakhand

bus accident in Uttarakhand

Uttarakhand: పెళ్లి ఇంట విషాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడి 25 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 21 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది.

ఉత్తరాఖండ్లోని పౌరీ గర్వాల్‌ జిల్లాలోని బీర్‌ఖాల్‌ ప్రాంతంలో పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు మంగళవారం రాత్రి లోయలో పడిపోయింది. ఈ ఘటనపై స్థానికుల సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 25 మంది మృతి చెందగా మరో  21 మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే పెళ్లి బృందానికి చెందిన 45 మంది వరకు బస్సులో ఉన్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. కోట్‌ద్వార్-రిఖ్నిఖాల్-బిరోఖల్ రహదారిపై సిమ్ది సమీపంలో ఈ బస్సు అదుపు తప్పి తూర్పు నాయర్ నది లోయలో పడిపోయింది. పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రాత్రంతా సహాయక చర్యలు చేపట్టారు. కాగా ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు రాష్ట్రపతి ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి: డీజీపీ దారుణ హత్య.. గొంతు కోసి ఆపై కాల్చి..!

Exit mobile version