Site icon Prime9

IND vs AUS 3rd T20 Match: ఉప్పల్ మ్యాచ్ కిక్కే వేరప్ప..!

IND vs AUS T20 final match

IND vs AUS T20 final match

IND vs AUS 3rd T20 Match: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ తుది దశకు చేరుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, భారత్‌ చెరొకటి విజయం సాధించి స్కోర్ సమం చేసుకోగా.. ఇక సిరీస్‌ నిర్ణయాత్మక పోరుకు నేడు ఉప్పల్‌ స్టేడియం వేదికకానుంది. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌కు హైదరాబాద్‌ వేదికకానుండగా.. సిరీస్‌ సాధించాలని ఇరు జట్లు పోటాపోటీగా బరిలోకి దిగనున్నాయి.

అయితే ఇటీవల జరిగిన ఆసియాకప్‌లో బౌలర్ల వైఫల్యంతో టీమ్‌ఇండియా ఇంటిబాట పట్టగా.. ప్రస్తుతం జస్ప్రీత్‌ బుమ్రా, హర్షల్‌ పటేల్‌ రాకతో బౌలింగ్‌ పటిష్టంగా ఉన్నట్టే కనిపిస్తుంది. ఇక యుజ్వేంద్ర చాహల్‌ స్థానంలో అశ్విన్‌కు ప్లేస్‌ దక్కుతుందో లేదో చూడాలి. రోహిత్‌శర్మ మంచి ఫామ్లో ఉండగా.. కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీతో టాపార్డర్‌ బ్యాట్స్ మెన్స్ జట్టు పటిష్టంగానే కనిపిస్తున్నా మైదానంలో వీరంతా ఏమేరుకు ప్రతిభకనపరుస్తారో నేటి మ్యాచ్తో తేలిపోనుంది. ఆ తర్వాత స్థానంలో సూర్యకుమార్‌, హార్దిక్‌ పాండ్యా, దినేశ్‌ కార్తీక్‌ బరిలో అడుగిడనున్నారు. భువనేశ్వర్‌ తిరిగి జట్టులోకి వచ్చే చాన్స్‌ ఉండగా.. బుమ్రా, హర్షల్‌, అక్షర్‌ పైనే ముఖ్యంగా బౌలింగ్‌ భారం ఉండనున్నట్టు సమాచారం. మరోవైపు ఎనిమిదో స్థానం వరకు స్పెషలిస్ట్‌ బ్యాటర్లతో నిండి ఉన్న ఆసిస్ జట్టు గత మ్యాచ్‌ జట్టునే కొనసాగే అవకాశాలున్నాయి.

పిచ్: ఇకపోతే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పులేదు. మైదానంలోని పిచ్‌ కూడా అటు బౌలింగ్‌ కు మరియు బ్యాటింగ్‌కు సమానంగా సహకరించనుంది.

భారత్‌ తుది జట్టు అంచనా: రోహిత్‌ (కెప్టెన్‌), రాహుల్‌, కోహ్లీ, సూర్యకుమార్‌, పాండ్యా, కార్తీక్‌, అక్షర్‌, హర్షల్‌, భువనేశ్వర్‌, బుమ్రా, చాహల్‌/ అశ్విన్‌.

ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), గ్రీన్‌, స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, ఇంగ్లిస్‌, డావిడ్‌, వేడ్‌, కమిన్స్‌, ఎలీస్‌, జంపా, హజిల్‌వుడ్‌.

ఇదీ చదవండి: IND vs AUS Second T20 Match: రెండో మ్యాచ్‌లో టీం ఇండియా విజయం.. మూడో మ్యాచ్ పైనే ఆశలన్నీ..!

Exit mobile version