Site icon Prime9

CBI: సీబీఐ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం

state govt shacking decision on CBI

state govt shacking decision on CBI

CBI: తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విషయంలో కీలక నిర్ణయం వెల్లడించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రాష్ట్రంలో ఇకపై ఏ కేసులోనైనా దర్యాప్తు చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి తీసుకోవాల్సిందేనంటూ ఆదేశాలు జారీచేసింది. ఇకపోతే దర్యాప్తు కోసం సీబీఐకి గతంలో ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్న పేర్కొనింది. ఈ మేరకు అక్టోబర్ 30వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జీఓ 51ని జారీచేసింది. ఇకపై ఏ కేసులోనైనా సీబీఐ దర్యాప్తు చేయాలంటే జీవో 51 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే.

ఇటీవల కాలంలో రాష్ట్రంలో పలు కేసుల్లో ప్రముఖల ఇళ్లల్లో మరియు కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: భాగ్యనగరంలో భారీ కార్పొరేట్ స్కాం.. 200 కోట్ల షేర్స్ బదిలీ..!

Exit mobile version