Site icon Prime9

Surrogacy: నయన్ సరోగసి చట్టబద్దమే.. తేల్చి చెప్పిన తమిళనాడు ప్రభుత్వ కమిటీ

tamilnadu govt report on nayan surrogacy

tamilnadu govt report on nayan surrogacy

Surrogacy: నయనతార విఘ్నేశ్ శివన్ జోడి సరోగసి విషయంపై తీవ్ర దుమారం రేగుతున్న విషయం విధితమే. తమకు కవలలు పుట్టారంటూ విఘ్నేశ్ శివన్ నెట్టింట షేర్ చేసిన వెంటనే అందరూ షాక్ అయ్యారు. జూన్లో పెళ్లి అయితే నాలుగు నెలలకే ఎలా పిల్లలు పుడతారని నెట్టింట పలు విమర్శలు వెల్లువెత్తాయి. అయితే సరోగసి ద్వారా పిల్లలు కన్నారని వెంటనే బయటకు వచ్చింది. దానితో భారత్ లో సరోగసి నిషేధమని మీరు అలా ఎలా పిల్లలకు జన్మనిచ్చారంటూ అనేక ప్రశ్నలు వెల్లువెత్తాయి దానితో రంగంలోకి దిగిన తమిళనాడు ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఓ కమిటీని నియమించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కమిటీ ప్రభుత్వానికి నయన్ దంపతుల సరోగసి వ్యవహారం చట్టబద్ధమే అంటూ నివేదికను అందించంది.

నయనతార సరోగసి వివాదం మీద తమిళనాడు ప్రభుత్వం వేసిన కమిటి, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చింది. నయన్ దంపతులు చట్టాన్ని ఉల్లంఘించలేదని, అన్ని సక్రమంగానే జరిగాయని రిపోర్ట్ లో వెల్లడించింది. నయనతారా విఘ్నేశ్ లకు 2016లోనే వివాహం జరిగిందని వారు అంతకుముందే చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని తెలిపింది. నయన్ ఫ్యామిలీ డాక్టర్ ఈ సరోగసి గురించి 2020లోనే నయన్ కు రికమండ్ చేశాడట. అయితే సరోగసికి సిద్దపడ్డ మహిళ ఈ అగ్రిమెంట్‌లోకి 2021 నవంబర్‌లో వచ్చిందని, ఈ ఏడాది మార్చిలోనే ఆమెలోకి పిండాన్ని ప్రవేశపెట్టారట. అక్టోబర్‌లో నయన్ దంపతులకు కవలలు పుట్టారని ఈ నివేదికలో వెల్లడించారు. అయితే ఇండియాలో సరోగసి చట్టాన్ని 2021లో చేస్తే జనవరి 2022 నుంచి అమల్లోకి వచ్చింది. అంటే నయనతార ఒప్పందం చేసుకున్నది దాని కంటే ముందే. కాబట్టి అది చట్టబద్దమేనని తమిళనాడు ప్రభుత్వానికి ఇన్వెస్టిగేషన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. మొత్తానికి ఇలా నయన్ సరోగసి వివాదానికి తెరపడింది.

ఇదీ చదవండి: “ఆర్ఆర్ఆర్” కు ఇంటర్నేషనల్ అవార్డు

Exit mobile version