Site icon Prime9

Inter Student Suicide: టాయిలెట్లో శవమై కనిపించిన విద్యార్థిని… తమిళనాట విద్యార్థుల వరుస ఆత్మహత్యలు

father committed suicide along with his son in ntr dist

father committed suicide along with his son in ntr dist

Inter Student Suicide: ఇటీవలె కాలంలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో ఇంటర్‌ విద్యార్థిని టాయిలెట్లో శవమై కనిపించింది. ఈ ఘటనతో ప్రస్తుతం తమళనాట తీవ్ర విషాదం నెలకొంది.

తమిళనాడులోని తూత్తుకుడిలో మంగళవారం రాత్రి ఇంటర్ చదువుతున్న విద్యార్థిని తన హాస్టల్‌లోని టాయిలెట్‌లో శవమై కనిపించింది. విద్యార్థిని హాస్టల్‌లో రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థిని మృతికి గల కారణాలపై అనేక కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్టు వారు తెలిపారు. ఈ మేరకు మృతురాలు తన సూసైడ్ నోట్‌లో కొన్ని వ్యక్తిగత కారణాలను రాసిందని… వాటికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలను మేము వెల్లడించలేమని.. విచారణ కొనసాగుతోందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు.

తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన 17 ఏళ్ల వైతీశ్వర్ తన అత్త చనిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. కాగా రోజు డల్ గా ఉంటూ ఒకరోజు తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక తన స్నేహితురాలికి నన్ను సజీవంగా చూడటం ఇదే చివరిసారి అని చెప్పిందని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే విద్యాసంస్థల్లో జరిగిన మరణాలపై విచారణ జరింపించాలని సీబీసీఐడీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఈ కేసు కేసును కూడా రాష్ట్ర పోలీసులు సీబీసీఐడీ విభాగానికి అప్పగించనున్నారు.

అయితే గత కొన్ని నెలల్లో తమిళనాడులో 12వ తరగతికి చెందిన 5 మంది విద్యార్థులు, 11వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు. చదువు ఒత్తిడితో విద్యార్థులు ప్రాణాలు తీసుకోవద్దని తమిళనాడు సీఎం స్టాలిన్ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. అలాగే విద్యార్థుల్లో మానసిక దృఢత్వాన్ని పెంపొందించాలని ఉపాధ్యాయులను కోరారు.

ఇదీ చదవండి: Shocking Death: ఆసుపత్రిలో అనూహ్య మరణం… పరామర్శకు వచ్చి తిరిగిరాని లోకాలకు…!

Exit mobile version