Site icon Prime9

T20 World Cup: పొట్టి ప్రపంచ కప్ విజేత ఇంగ్లండ్

england won the t20 world cup 2022

england won the t20 world cup 2022

T20 World Cup: ఉత్కంఠగా సాగిన టీ20 ప్రపంచ కప్ తుదిపోరులో ఇంగ్లండ్ జట్టు ఘన విజయం సాధించింది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన ఈ సమరంలో పాకిస్థాన్ జట్టుపై ఐదు వికెట్ల తేడాతో ఆంగ్ల జట్టు 138 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ విజయంతో ఇంగ్లండ్ జట్టు తమ ఖాతాలో రెండో పొట్టి ప్రపంచక కప్ ను వేసుకుంది.

మొదట టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో పాక్ బ్యాటర్లు 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేశారు. కాగా వీరిలో మసూద్ 28 బంతుల్లో 38 పరుగుల అత్యధిక స్కోర్ చేశారు. ఇంగ్లండ్ బౌలర్ల దాటికి పాక్ ఆటగాళ్లు బరిలో నిలబడలేకపోయారు. వచ్చిన వారు వచ్చినట్టే పెవిలియన్ బాటపట్టారు. ఇండ్లండ్ బౌలర్లలో సామ్ కరన్ 3 వికెట్లు తియ్యగా క్రిస్ జోర్దాన్, ఆదిల్ రషీద్ రెండో రెండు వికెట్లు తీశారు. బెన్ స్టోక్స్ ఒక వికెట్ తీశాడు. ఇక 138 పరుగుల అత్యల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆంగ్ల జట్టు ఆటగాళ్ల ఇంకా ఒక ఓవర్ మిగిలుండగానే ఇంగ్లండ్ జట్టు విజయకేతనం ఎగురవేసింది. ఆంగ్ల ఆటగాళ్లలో బెన్ స్టోక్స్ అర్థ సెంచరీతో అదరగొట్టాడు.

ఇదీ చదవండి: ఐసీసీ ఛైర్మ‌న్‌గా “గ్రెగ్” ఏకగ్రీవం

Exit mobile version