Site icon Prime9

Chandigarh University: 60 మంది అమ్మాయిల బాత్రూం వీడియోలు లీక్… ఆ యూనివర్సిటీలో హైటెన్షన్

Chandigarh university

Chandigarh university

Chandigarh University: తనలోని ఆడతనాన్ని మరచింది. సమాజంలో తన విలువైన స్థానాన్ని తానే చేతులారా తుడిచేసుకుంది. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ఓ ఘటన సోషల్ మీడియా వేదికగా బయటపడింది. స్నేహితురాలు, మన రూం మేటే కదా అని నమ్మారు. కానీ ఊహించని రీతిలో నమ్మక ద్రోహం చేస్తుంది. బాత్రూంలోని ప్రైవేటు వీడియోలను సైతం తీస్తుందని ఆ అమాయకపు అమ్మాయిలు పసిగట్టలేకపోయారు. తనతో పాటు యూనివర్సిటీ హాస్టల్ లో ఉంటున్న దాదాపు 60మంది అమ్మాయిల వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టింది ఓ యువతి. ఈ షాకింగ్ ఘటన పంజాబ్‌లోని చండీగఢ్‌ యూనివర్సిటీలో చోటుచేసుకుంది.

పంజాబ్‌లోని చండీగఢ్‌ యూనివర్సిటీలో చదువుతున్న ఓ యువతి తనతో పాటు చదువుకుంటూ హాస్టల్లోని తన రూమ్‌లో ఉంటున్న అమ్మాయి, (60 మం‍ది అమ్మాయిల) ప్రైవేటు వీడియోలను రికార్డ్ చేసింది. బాత్‌రూమ్‌లో స్నానం చేస్తున్న సమయంలో గుట్టచప్పుడు కాకుండా ఫోన్లో వీడియోలు తీసి అనంతరం, ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో మరియు తన స్నేహితులకు షేర్‌ చేసింది. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు ఆమెను నిలదీసింది. దానితో హాస్టల్లోని విద్యార్థులంతా నిరసనకు దిగారు ఆమెపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న యూనివర్సిటీ అధికారులు, పోలీసులు.. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, నిందితురాలు.. మరికొందరు విద్యార్థుల ప్రైవేటు వీడియోలను సైతం తీసి సోషల్ మీడియాలో లీక్ చేస్తున్నట్టు విద్యార్థినిలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా ఈ సంఘటనతో హాస్టల్‌లోని పలువురు విద్యార్థినిలు ఆత్మహత్యకు యత్నించినట్టు వస్తున్న వార్తలపై పోలీసులు, యూనివర్సిటీ పరిపాలనా విభాగం స్పందించింది. ఆ వార్తలు అవాస్తవం అంటూ ఖండించింది. పుక్లార్లు నమ్మవద్దంటూ స్పష్టం​ చేసింది. ఈ వ్యవహారంపై పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ సైతం స్పందించారు.
నిందితులను విడిచిపెట్టే ప్రసక్తేలేదంటూ విద్యార్థులంతా ప్రశాంతంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: Ashwini Vaishnav: చీపురు ప‌ట్టి రైల్వే స్టేష‌న్‌లో ఊడ్చిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

Exit mobile version