Site icon Prime9

Samantha: సమంతకు ప్రాణాంతక వ్యాధి.. ఆమె ఇక బ్రతకడం కష్టమేనా..!

Samantha has a myositis disease It is difficult for her to survive

Samantha has a myositis disease It is difficult for her to survive

#Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ప్రస్తుతం తెలుగు, దక్షిణాది భాషలు, హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఇకపోతే ఆమె ప్రస్తుతం యశోద, ‘శాకుంతలం’వంటి పాన్ ఇండియా మూవీస్ లో మెయిన్ రోల్ చేస్తుంది. ఇటీవల కాలంలో నాగచైతన్యతో విడాకుల అనంతరం ఆమె అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. నిత్యం నెట్టింట అనేక ప్రశ్నలు, కామెంట్లు, ట్రోల్స్ ఈ ముద్దుగుమ్మను ఏదో రకంగా వేధిస్తూనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే సమంత జీవితం కుదుటపడుతుందనుకుంటున్న సమయంలో మరో షాకింగ్ వార్త చెప్పింది. తనకు ప్రాణాంతక కండరాల వ్యాధి ఉందని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు ఓ ఫోటో ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది. ఈ వార్త విని సినీ ఇండస్ట్రీతోపాటు అభిమానులు షాక్ గురయ్యారు.

తనకు ప్రాణాంతకమైన ‘మైయోసిటీస్’ అనే వ్యాధి ఉన్నట్లు సమంత ఇన్ స్టాగ్రామ్ లో షాకింగ్ విషయం చెప్పింది. చేతికి సెలైన్ ఎక్కించుకుంటున్న ఫొటోను వెనుక నుంచి చూపిస్తూ ఫొటో షేర్ చేసింది. ఈ వార్త విన్న ఆమె అభిమానులంతా షాక్ అవుతున్నారు. అసలేంటి వ్యాధి? సమంత బతకదా? ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాము అంటూ అనేక కామెంట్లు చేస్తూ ఆ వ్యాధి గురించి ఆరాతీస్తున్నారు. సామ్ త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు.

మైయోసిటీస్ వ్యాధి అంటే ఏంటి
మైయోసిటిస్ అనేది దీర్ఘకాలిక కండరాల వ్యాధి. దీన్ని చర్మ వ్యాధి అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి సోకిన వారికి చర్మంపై దద్దుర్లుతో కూడిన మంటపుడుతుంది. ఈ అరుదైన ఈ వ్యాధిని నిర్ధారించడం కష్టం. లక్షణాలు కాలక్రమేణా కనిపిస్తాయి. ప్రాథమిక లక్షణాలుగా కండరాల నొప్పి, పుండ్లు పడడం, అలసట, మింగడంలో ఇబ్బంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఉంటాయి. పురుషుల కంటే స్త్రీలు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. అతిగా మేకప్ వేసుకోవడం వల్ల చికిత్సల వల్ల ఈ వ్యాధి సమంతకు వచ్చి ఉండవచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మన సామ్ త్వరగా ఈ వ్యాధి నుంచి కోలుకోవాలని, ప్రేక్షకులను తనదైన నటనతో అలరించాలని కోరుకుందాం.

ఇదీ చదవండి డ్యాన్స్ మా రక్తంలోనే ఉంది.. జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Exit mobile version